ఉద్యోగం రాదేమోనని మనస్థాపంతో వ్యక్తి ఆత్మహత్య

by Vinod kumar |
ఉద్యోగం రాదేమోనని మనస్థాపంతో వ్యక్తి ఆత్మహత్య
X

దిశ, నేలకొండపల్లి: ఉన్నత చదువులు చదివి ఉద్యోగం రాలేదని మనస్థాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రాయి గూడెం గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బుడిగె శ్రీను అనే వ్యక్తి కుమారుడు వీరబాబు(28) ఉన్నత చదువులు చదివాడు. వీరబాబు గత కొంత కాలంగా జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు. అయితే తనకు ఉద్యోగ అర్హత వయసు పెరిగిపోతోందని మనస్థాపానికి గురై.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గమనించిన చుట్టుపక్కల వారు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అప్పటికే అతను మృతి చెందినట్లుగా తెలుస్తోంది. దీంతో చేతికి అంది వచ్చిన కుమారుడు విగతజీవిగా పడి ఉండటాన్ని చూసిన తల్లిదండ్రుల రోధనలు మిన్నంటాయి. ఈ ఘటనపై పోలీసులకు ఎటువంటి సమాచారం అందలేదని తెలిపారు.

Advertisement

Next Story