త్వరలో పెట్రోల్, డీజిల్ ధరల మోత..

by Harish |
త్వరలో పెట్రోల్, డీజిల్ ధరల మోత..
X

దిశ, వెబ్‌డెస్క్: గత కొంతకాలంగా స్థిరంగా కొనసాగుతున్న పెట్రోల్ ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్-రష్యా యుద్ధంతో పాటు అంతర్జాతీయంగా పెరిగిపోతున్న ముడి చమురు ధరలు రికార్డు గరిష్ఠానికి చేరుకోవడంతో ప్రభుత్వ రంగ చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం దేశంలోని కీలక ప్రాంతాల్లో జరుగుతున్న ఎన్నికల తర్వాత ఇంధన ధరల్లో మార్పులను ప్రభుత్వం ప్రకటించవచ్చని తెలుస్తోంది. తద్వారా పెట్రోల్, డీజిల్ లీటర్‌పై రూ. 12 వరకు పెరగవచ్చని, దీన్ని ఒక్కసారే పెంచకుండా దశలవారీగా పెంపు నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

ఇటీవల ఉక్రెయిన్-రష్యా యుద్ధం వల్ల గ్లోబల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు ఏకంగా బ్యారెల్‌కు 120 డాలర్లకు చేరుకుంది. రికార్డు స్థాయిలో ముడి చమురు ధరలు పెరిగినప్పటికీ దేశీయ పరిస్థితుల వల్ల ప్రభుత్వ రంగ చమురు సంస్థలు నష్టాలు ఉన్నా సరే పెట్రోల్, డీజిల్ ధరలను పెంచలేదు. మరికొద్ది రోజుల్లో ఎన్నికలు పూర్తయిన తర్వాత చమురు సంస్థలు తమ మార్జిన్ స్థాయిలను కోల్పోకుండా పెట్రోల్, డీజిల్‌పై కనీసం రూ. 12 వరకు పెంచాల్సి వస్తుందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ వివరించింది. కాగా, ప్రస్తుతం హైదరాబాద్‌లో పెట్రోల్ డీజిల్ ధర రూ. 108.2 ఉండగా, డీజిల్ లీటర్ ధర రూ. 94.62 వద్ద ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ రూ. 95.41 ఉంటే, డీజిల్ రూ. 86.67గా ఉంది.

Advertisement

Next Story