- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
TATA Neu App: టాటా సూపర్ యాప్ 'న్యూ'ను ప్రారంభించిన సంస్థ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్!
ముంబై: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాటా గ్రూప్ సూపర్ యాప్ 'న్యూ(ఎన్ఈయూ)'ను టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ గురువారం అధికారికంగా ప్రారంభించారు. ఈ సూపర్ యాప్ టాటాకు చెందిన అన్ని బ్రాండ్‌లను ఒకే ప్లాట్‌ఫామ్‌పైకి తీసుకొస్తుంది. టాటా న్యూ యాప్‌లో విమానయాన సేవలు, హోటళ్లు, మెడిసిన్, కిరాణా సామాగ్రి, ఈ-కామర్స్ సహా కంపెనీకి చెందిన అన్ని రకాల సేవలు ఒకేచోట వినియోగించుకోవచ్చు. అంతేకాకుండా యాప్‌లో చేసిన లావాదేవీలు, చెల్లింపులకు న్యూకాయిన్స్ రూపంలో రివార్డులను కూడా కంపెనీ అందించనుంది.
టాటా గ్రూపునకు చెందిన ఎయిర్ఏషియా, బిగ్‌బాస్కెట్, క్రోమా, టాటా క్లిక్, ఇండియన్ హోటల్స్, వెస్ట్‌సైడ్ సహా అన్ని బ్రాండ్లు ఒకే యాప్‌లో అందుబాటులో ఉండనున్నాయి. టాటా న్యూ సూపర్ యాప్ ప్రారంభం సందర్భంగా మాట్లాడిన ఎన్ చంద్రశేఖరన్.. టాటా న్యూలో సంస్థకు చెందిన అన్ని బ్రాండ్ సేవలను ఒక దగ్గరే పొందవచ్చు. సాంప్రదాయ వినియోగదారులను ఆధునిక టెక్నాలజీ ద్వారా చేరువ కావడానికి ఇది సరికొత్త మార్గంగా భావిస్తున్నాం. దేశీయ వినియోగదారుల జీవన సరళిని మరింత సరళంగా, సులభతరం చేయడమే టాటా లక్ష్యం. టాటా న్యూ ద్వారా మెరుగైన ఎంపిక, అనుభూతి, నాణ్యమైన సేవలకు కేంద్రంగా నిలవనుందని ఆయన పేర్కొన్నారు.
ఈ యాప్‌లో టాటా గ్రూపునకు చెందిన మిగిలిన బ్రాండ్లు స్టార్‌బక్స్, టాటా 1ఎంజీ, టాటా ప్లే సంబంధించిన సేవలు అందుబాటులో ఉంటాయి. త్వరలో విస్తారా, ఎయిర్ ఇండియా, టైటాన్, తనిష్క్, టాటా మోటార్స్ సేవలు అందుబాటులో ఉంటాయని కంపెనీ వెల్లడించింది.