- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కుక్క కోసం పాలరాతి విగ్రహం.. పిక్స్ వైరల్..
దిశ, వెబ్‌డెస్క్: కుక్కలంటే ఇష్టపడని వారు చాలా అరుదుగా ఉంటారు. ప్రతి ఒక్కరు తమ ఇంట్లో ఓ కుక్కను పెంచుకోవాలని ఆలోచిస్తారు. అలా పెంచుకునే కుక్కను ఇంటిలో పెంపుడు జంతువులా కాకుండా ఓ కుటుంబ సభ్యుడిగా గుర్తిస్తారు. దానిపై ఎనలేని ప్రేమ చూపుతారు. దానికేమైనా అయిందంటే తల్లడిల్లిపోతారు. అంత ఇష్టంగా పెంచుకున్న కుక్క చనిపోతే కొన్నాళ్లు బాధపడి మర్చిపోతారు. కానీ తమిళనాడులోని ఓ వ్యక్తి మాత్రం తన పెంపుడు కుక్క ఎప్పటికీ మరుపు రాకూడదని భావించాడు. అంతే తన కుక్కకు విగ్రహం కట్టించేశాడు. ఇది వినడానికి నమ్మసక్యంగా లేక పోయినా ఇదే నిజం. ఇది తమిళనాడులోని శివగంగా మధురైలో జరిగింది. ముత్తు అనే 82 ఏళ్ల వృద్ధుడు తన కుక్కకు గుడి కట్టించాడు.
అతడో రిటైర్డ్ ప్రభుత్వు ఉద్యోగి. అతడి పెంపుడు కుక్క పేరు టామ్. అయితే టామ్ తనతో 2010 నుంచి ఉందని, కానీ 2021లో టామ్ చనిపోయాడని చెప్పాడు. టామ్‌తో తాను గడిపిన కాలంలో తన పిల్లల కంటే టామ్‌పై ఎక్కువ ప్రేమ ఏర్పడిందని, అది చనిపోవడం తననెంతో కలచి వేసిందని చెప్పాడు. అప్పుడే తన టామ్ కోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నానని, అప్పుడే విగ్రహం కట్టించాలన్న ఆలోచన వచ్చిందని ముత్తు చెప్పుకొచ్చాడు. అంతే వెంటనే రూ.80 వేలు ఖర్చు చేసి టామ్ కోసం గుడి కట్టించేశాడు. ముత్తు తన కుక్క విగ్రహాన్ని పాలరాతితో కట్టించాడు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. ఆ కుక్క విగ్రహానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.