- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆకాశంలో హోటల్.. 5 వేల మందికి ఆతిథ్యం!
దిశ, ఫీచర్స్ : భూగర్భాన, సాగరంలో, నీటిపైన, చెట్ల కొమ్మలపై, కొండల అంచున.. ఇలా రకరకాల హోటల్స్ చూసుంటారు. కానీ ఎప్పటికీ ఆకాశంలో నిలిచిపోయే హోటల్‌ను ఇప్పటిదాకా చూసుండరు. అయితే ఆ అద్భుతం త్వరలోనే ఆవిష్కృతం కానుంది. చూడచక్కని స్కై డైనింగ్ అనుభవం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం.
అణుశక్తితో నడిచే 'ఫ్లయింగ్ హోటల్'కు సంబంధించిన డిజైన్‌ను టోనీ హోల్మ్‌స్టన్ అనే వ్యక్తి రూపొందించాడు. ఇక ఇన్ఫోగ్రాఫిక్ సైన్స్ అండ్ టెక్నాలజీ వీడియోలకు ప్రసిద్ధి చెందిన యెమెన్ ఇంజనీర్ హాషెమ్ అల్-ఘైలీ ఇందుకు సంబంధించిన వీడియో బైట్స్ చేశాడు. దాదాపు 5,000 మంది ప్రయాణీకులను తీసుకెళ్లగల సామర్థ్యం దీని సొంతం కాగా.. ఇందులో జిమ్, స్విమ్మింగ్ పూల్ తదితర ప్రాథమిక సౌకర్యాలు సహా 360-డిగ్రీల వీక్షణ, ఎంటర్‌టైన్మెంట్ డెక్, షాపింగ్ మాల్, స్పోర్ట్స్ సెంటర్, రెస్టారెంట్, బార్, ప్లే గ్రౌండ్, థియేటర్, వెడ్డింగ్ హాల్ వంటి సకల సౌలభ్యాలున్నాయి. ప్రత్యేక వింగ్‌లో సమావేశ కేంద్రాన్ని కలిగి ఉండటంతో పాటు అధునాతన వైద్య సదుపాయాలు కూడా ఉన్నాయి. ఇక ఈ స్కై క్రూయిజ్ చాలా రోజులు లేదా నెలల పాటు గాలిలోనే చక్కర్లు కొట్టనుంది.
ఈ క్రూయిజ్‌లో 20 న్యూక్లియర్ ఫ్యూజన్ ఇంజన్స్ ఉంటాయి. కాబట్టి ఫ్యూయల్ రీఫిల్ కోసం ఎప్పటికీ కిందకు దిగాల్సిన అవసరం లేదు. ప్రయాణీకులు సహా సిబ్బందిని ప్రత్యేక విమానంలో వారి వారి గమ్యస్థానాల నుంచి పికప్ చేసుకుని ఆ తర్వాత డ్రాప్ చేస్తారు. స్కై క్రూయిజ్ గాలిలో ఉన్నప్పుడు ఏదైనా సమస్య తలెత్తితే దానికదే మరమ్మతు చేసుకోవడంతో పాటు ఆటోమేటిక్ మెయింటెనెన్స్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. అంతేకాదు అత్యాధునిక కమాండ్ డెక్ కలిగిఉన్న ఈ విమానం.. ప్రకృతి విపత్తులు లేదా ఏవేని ప్రమాదాలు సంభవించే నిమిషాల ముందు కృత్రిమ మేధస్సు ద్వారా వాటిని అంచనా వేయగలదు. అప్పుడు యాంటీ వైబ్రేషన్స్ సృష్టించడం ద్వారా సిస్టమ్‌ను ప్రేరేపిస్తుంది.
'ఇది భవిష్యత్తు రవాణా'గా కనిపిస్తోంది. పైగా దీనికి పైలట్లు అవసరం లేదని నేను నమ్ముతున్నాను' అని అల్-ఘైలీ అభిప్రాయపడ్డాడు. అయితే ఈ విమానం ప్రజలను ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకెళ్తుంది. ఇది ఏ ప్రదేశంలో ఉంటుందనే విషయం కొంతవరకు అస్పష్టంగానే ఉంది. అంతేకాదు ఈ స్కై క్రూయిజ్ ప్రారంభ తేదీ ఇంకా ప్రకటించకపోవడం పట్ల నెటిజన్లు కూడా సందేహాలు వ్యక్తం చేశారు. 'క్రాఫ్ట్‌లో ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్న అంశంపై మాట్లాడే ముందు వారు అణు ఇంజిన్ బరువు-వర్సెస్-థ్రస్ట్ సాధ్యాసాధ్యాలను చర్చించాలి' 'స్కై హోటల్ ఎంటర్‌టైన్‌మెంట్ డెక్‌లోని వివిధ అంతస్తులను కనెక్ట్ చేసేందుకు ఉద్దేశించిన ఔట్‌డోర్ ఎలివేటర్స్ సాధ్యం కాకపోవచ్చు' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.