- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
1969 నాటి గర్ల్ లెటర్.. జూమ్ కాల్, వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి ముందే అంచనా
దిశ, ఫీచర్స్ : ఒక ఇంటి నుంచి మరో ఇంటికి షిఫ్ట్ అయినప్పుడు ఇంట్రెస్టింగ్ థింగ్స్ దర్శనమిస్తుంటాయి. అంతకుముందు అక్కడున్నవారు వదిలేసిన వస్తువుల్లో కొన్ని వింతగా కనిపించడంతో పటు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇలాంటి అనుభవమే యూకేకు చెందిన రోసా బెకర్టన్‌కు ఎదురైంది. తన భర్త పీటర్ సోఫాను కదిలించినప్పుడు దొరికిన లెటర్ ఆమెను విస్మయానికి గురిచేసింది. వెంటనే ఆ విషయాన్ని ఆన్‌లైన్‌లో షేర్ చేసుకోవడంతో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
రోసాకు దొరికిన 50 ఏళ్ల కిందటి ఓల్డ్ లెటర్‌లో భవిష్యత్తు గురించి ప్రస్తావించిన ఆలోచన.. ఇప్పుడు కళ్ల ముందు కనిపిస్తుండటంతో షాకైంది. ఆ లెటర్ ఫిబ్రవరి 23, 1969న స్కూల్ ప్రాజెక్ట్ కోసం రాసినది కాగా.. అప్పటికే 11ఏళ్లు వయసున్న అమ్మాయి 1980కి వచ్చేసరికి ఎలా ఉంటుందో అందులో రాసిపెట్టుకుంది. ఆ టైమ్ వరకు తనకు పెళ్లి అయిపోతుందని, బ్యాంక్ ఎంప్లాయిగా తను ఆఫీసులో పనిచేస్తుంటే భర్త మాత్రం ఇంట్లో కూర్చుని 'వర్క్ ఫ్రమ్ హోమ్' చేస్తాడని చెప్పుకొచ్చింది. ఇక రిసీవర్‌తో ఉన్న ఫోన్స్ పూర్తిగా మారిపోతాయని.. టీవీ సైజ్ స్క్రీన్‌లో బొమ్మ కనిపిస్తుంటే మాట్లాడుకోవచ్చని(లైక్ వీడియో కాల్) పేర్కొంది.
అంతేకాదు స్క్రీన్‌తో పాటు దానికి ముందు బటన్స్ కలిగివుండే టీవీ.. సోఫాలోనే కూర్చుని ఆపరేట్ చేసేవిధంగా మారిపోతుందని కూడా ప్రెడిక్ట్ చేసింది. ఇక భర్తకు కాఫీ ప్రిపేర్ చేసిద్దామంటే.. ఇప్పటి మాదిరిగా ఉండదని, చూయింగ్ గమ్ నమిలితే ఆ ఫ్లేవర్ వచ్చేస్తుందని చెప్పుకొచ్చింది. ఇక బటన్ నొక్కడంతోనే డోర్స్ ఓపెన్ అవుతాయని ఫాంటసీలు రాసుకొచ్చింది. అయితే ఆ అమ్మాయి లెటర్‌లో పొందుపరిచిన ప్రతీ అక్షరం నిజం కాగా.. ఆమె ఆలోచనలకు టీచర్ 'గుడ్' మార్క్‌తో అభినందించడం విశేషం.