- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దానికి భయపడి బాయ్ ఫ్రెండ్‌తో బాలిక జంప్.. కానీ, అతడు చేసిన పనికి షాక్!
దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా పరీక్షలు అంటే చాలా మంది విద్యార్థులు ఆందోళన చెందుతుంటారు. పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధించాలని కొందరు.. ఫెయిల్ కాకూడదని మరికొందరు ఒత్తడికి గురవుతుంటారు. కొందరు ఫెయిల్ అవుతామనే భయంతో ఆత్మహత్యలు చేసుకోవడం, ఇంట్లో నుంచి పారిపోవడం వంటివి చేస్తుంటారు. తాజాగా కర్నాటకలో ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. పరీక్షల అంటే భయంతో ఓ బాలిక ప్రియుడితో కలిసి ఇంట్లో నుంచి పరారయ్యింది.
వివరాల ప్రకారం.. కర్నాటకలోని మైసూర్‌లో ఓ బాలిక పదవ తరగతి చదువుతుంది. ప్రస్తుతం ఆమెకు పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షలు అంటే భయంతో.. ఎలాగైనా పరీక్షలు రాయకుండా తప్పించుకోవాలని బాయ్ ఫ్రెండ్‌తో కలిసి ఇంట్లో నుంచి జంప్ అయింది. అనంతరం బాయ్ ఫ్రెండ్‌తో కలిసి బెంగళూర్‌కు పారిపోయింది. అక్కడికి వెళ్లిన తర్వాత బాయ్ ఫ్రెండ్ రూట్ మార్చాడు. ఆ బాలికతో బెంగళూర్‌లో వద్దని.. చెన్నై వెళ్దామని కోరాడు. అక్కడ తనకు తెలిసిన వారు ఉన్నారనీ.. వాళ్లు జాబ్ కూడా చూపిస్తారనీ చెప్పాడు. బాయ్ ఫ్రెండ్ మాటల్లో తేడా రావడంతో ఆ బాలికకు అనుమానం వచ్చింది.
ప్రియుడు అక్కడికి వెళ్దామని బలవంతం చేసిన ఆ బాలికకు మాత్రం ఇష్టం లేదు. వీరి ఇద్దరు మధ్య ఈ చర్చ నడుస్తుండగా అదే సమయంలో ఓ రైల్వే కానిస్టేబుల్ అక్కడకు వచ్చాడు. బాలిక మాట్లాకుండా కళ్లతో ఆ కానిస్టేబుల్ ఏదో సైగ చేసింది. వీరిపై అనుమానం రావడంతో కానిస్టేబుల్ విచారించాడు. బాలిక జరిగిన కథ మొత్తం చెప్పింది. దీనితో చెన్నైలోని ఆ బాలుడి ఫ్రెండ్స్‌కు పోలీసులు ఫోన్ చేశారు.
వారు పోలీసులు ఫోన్ చేయగానే సరిగ్గా సమాధానం ఇవ్వకుండానే కాల్ కట్ చేశారు. ఆ బాలిక బాయ్ ఫ్రెండ్‌ను గట్టిగా విచారిస్తే.. అసలు నిజం బయటపడింది. బాలికను చెన్నై తీసుకువెళ్లి వ్యభిచారం చేయించాలనుకున్నట్లు ఆ బాలుడు చెప్పాడు. దీనితో పోలీసులు యువతి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి.. వారితో తిరిగి ఇంటికి పంపించారు. బాలుడిపై కేసు నమోదు చేసి.. వ్యభిచార ముఠాతో ఉన్న సంబంధంపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.