- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బడాబాబుల జోలికెళ్లని సర్కార్.. పేదోళ్లపై ప్రతాపం చూపిస్తారా!
దిశ ప్రతినిధి, మేడ్చల్: ధన బలం, కండ బలం తో బడాబాబులు వేలాది ఎకరాలు కబ్జా చేస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం పేదలు 20 గజాల్లో గుడిసెలు వేసుకుంటే కూల్చేసి, కేసులు పెట్టడం శోచనీయమని సీపీపీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. నాడు జరిగిన అఖిలపక్షం సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న పేదలకు 120 గజాలు కేటాయించి క్రమబద్దీకరిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం జీవో. నెంబర్ 58, 59 తీసుకొచ్చినప్పటికీ, నేటివరకు ఈ జీవో లు సక్రమంగా అమలు కాలేదన్నారు. ప్రభుత్వ భూముల్లో నివాసముంటున్న పేదల గుడిసెలను జీవో. నెంబర్ 58, 59 ప్రకారం క్రమబద్దీకరించి పట్టాలివ్వాలని, అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టివ్వాలని, భూమి ఉన్న పేదవారికి నివాసం ఏర్పాటుకై ప్రభుత్వం రూ.6 లక్షలు ఆర్థిక సహాయం చేయాలనీ డిమాండ్ చేస్తూ.. సోమవారం కీసరలోని మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో సిపిఐ ఆధ్వర్యంలో సోమవారం మహా ధర్నా జరిగింది.
ఈ సందర్భంగా చాడా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి వల్ల స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న లక్షలాదిమంది పేదలు ఇంకా ఆశ్రయం లేని జీవితాలు గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ప్రసాదించిన రాజ్యాంగం ప్రకారం ప్రజలకు కుడు, గూడు, విద్య, వైద్యం, ఉపాధి సౌకర్యాలు కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వాలదేనని తెలిపారు. బడుగుబలహీన వర్గాలకు నివాస సదుపాయాలు కల్పించని, వారి జీవితాలలో వెలుగులు నింపని నేటి పాలకులు ఆజాదికా అమృత్ మహోత్సవ్ ఎందుకు జరుపుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు.
వేలాది మంది ఇళ్లు లేని పేదలతోపాటు చాడ వెంకట్ రెడ్డి, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎంపీ సయ్యద్ అజీజ్ పాషా, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎన్. బల మల్లేష్, జిల్లా కార్యదర్శి డిజి. సాయిలు గౌడ్, భారత జాతీయ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేదునూరి జ్యోతి, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె. కాంతయ్య, తెలంగాణ సర్వోదయ మండలి అధ్యక్షులు ఆర్. శంకర్ నాయక్, తెలంగాణ గిరిజన సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఆర్. అంజయ్య నాయక్ తదితరులు ఈ మహా ధర్నాలో పాల్గొన్నారు.