- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ కానిస్టేబుల్ ఫోటో చూసి అంతా షాకయ్యారు! ఇదీ ధైర్యమంటే..?!
దిశ, వెబ్‌డెస్క్ః పోలీస్‌ని చూడగానే ఏదో తెలియని భయం చాలా మందికి. అవినీతికి అడ్రస్‌లా చూస్తారు. కానీ, పోలీసు ఉన్నదే ప్రజలకు శాంతి, భద్రతలనివ్వడానికి అని చాలా మంది గుర్తించరు. ఉధ్రిక్త పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి ప్రజలను కాపాడే నిస్వార్థ రూపం పోలీసు. ఇలా, మానవత్వం, జాలి దయ, నిజాయితీ ఉన్న పోలీసులు కోకొల్లలుగా ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు రాజస్థాన్‌కు చెందిన ఓ కానిస్టేబుల్, నేత్రేష్ శర్మ. రియల్ హీరోగా మారాడు. నెట్టింట్లో వైరల్ అవుతున్న ఫోటోలో అతను భగ భగ మండుతున్న మంటల నుండి ప్రాణాలకు తెగించి పసిపాపను కాపాడుతున్న దృశ్యం ఇంటర్నెట్‌లో చాలా మంది దృష్టిని ఆకర్షించింది. ఇటీవల రాజస్థాన్ కరౌలిలో జరిగిన మత అల్లర్లలో ఆందోళనకారులు ఇళ్లను తగలబెట్టారు. ఈ అల్లర్లలో ఓ వీధిలో ఇళ్లు కాలిపోతుంటే, ఎవరికి వారు తమ ప్రాణాలను కాపాడుకోడానికి పరుగులు పెట్టారు. అయితే, కానిస్టేబుల్ నేత్రేష్ శర్మ మాత్రం ధైర్యానికి ప్రతిరూపంగా ప్రజలను రక్షించడంలో నిమగ్నమయ్యాడు. ఇరుకైన సందుల గుండా మండుతున్న భవనాల మధ్య నుండి ఓ చంటి బిడ్డను సురక్షితంగా కాపాడి 'శెభాష్' అనిపించుకున్నాడు. షామ్లీ ఎస్ఎస్పీ సుకీర్తి మాధవ్ మిశ్రా ఈ ఫోటోను ట్విట్టర్‌లో పంచుకున్నాడు. దానికి చాలా మంది స్పందిస్తున్నారు. నేత్రేష్‌ను మనసారా ప్రశంసిస్తున్నారు.