- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీటెక్ విద్యార్థి కల సాకారం.. రూ. 50 లక్షల ప్యాకేజ్‌తో జాబ్ ఆఫర్
దిశ, ఫీచర్స్ : హర్యానా, అంబాలా కంటోన్మెంట్‌కు చెందిన బీటెక్ విద్యార్థి మధుర్ రఖేజా.. మైక్రోసాఫ్ట్ నుంచి రూ. 50 లక్షల ప్యాకేజ్‌తో జాబ్ ఆఫర్ పొందాడు. UPES స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ నుంచి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్(ఆయిల్ అండ్ గ్యాస్ ఇన్ఫర్మాటిక్స్‌లో స్పెషలైజేషన్)లో బీటెక్ పూర్తి చేసిన రఖేజా.. తనకు ఇష్టమైన మైక్రోసాఫ్ట్ కంపెనీలో ఉద్యోగం చేయలని నిశ్చయించుకున్నాడు. ఈ క్రమంలో అమెజాన్, కాగ్నిజెంట్, ఆప్టమ్ వంటి కంపెనీ ఆఫర్లను కూడా తిరస్కరించాడు.
'ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది జీవితాలను మార్చగలిగే, ప్రభావితం చేసే టెక్నాలజీ సామర్థ్యంపై నాకు చాలా ఆసక్తి ఉండేది. ఎప్పటికైనా ఈ కంపెనీలో భాగం కావాలని కోరుకున్నాను. అందువల్ల తరచూ ఇతరుల ఇంటర్వ్యూ అనుభవాలను సమీక్షిస్తూ అవసరమైన నైపుణ్యాలను నేర్చుకోవడం ద్వారా ఈ ప్రక్రియకు సిద్ధమయ్యాను' అని రఖేజా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే.. అతను త్వరలోనే బెంగుళూరులోని మైక్రోసాఫ్ట్ కార్యాలయంలో జాయిన్ కానున్నాడు. అక్కడ అనుభవజ్ఞులైన వారితో కలిసి పనిచేయడం ద్వారా సరికొత్త విషయాలను నేర్చుకుని సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా ఎదగాలనేది మధుర్ కల.