- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మరణిస్తూ ఆరుగురిని బ్రతికించిన యువకుడు.. పుట్టెడు దుఃఖంలో తల్లిదండ్రులు
దిశ, సత్తుపల్లి టౌన్: అవయవాలు దానం చేసి మరో ఆరుగురికి ప్రాణం పోసిన కోట సాయిరాం 20 సంవత్సరాలు సత్తుపల్లికి చెందిన లారీ ఓనర్స్ సెక్రటరీ అయిన కోటా మోహన్ రావు రమాదేవిల ఏకైక పుత్రుడు సాయిరామ్ కామారెడ్డిలో ఫుడ్ ప్రాసెస్ కోర్సు చదువుతున్నాడు. తను చదువుతున్న కాలేజీ సమీపంలో గుర్తుతెలియని ఆటో ఢీ కొట్టడంతో స్పృహ కోల్పోగా హాస్పిటల్‌లో చేర్చగా సాయిరాంకు బ్రెయిన్ డెడ్ అయినట్లుగా డాక్టర్లు తల్లిదండ్రులకు తెలియజేశారు. అంతటి దుఃఖంలో కూడా తల్లిదండ్రులు సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని కుమారుడి జ్ఞాపకాలను బ్రతికించుకోవాలనుకున్నారు.
తన కుమారుడి అవయవాలు దానం చేసి మరో ఆరుగురికి ప్రాణదానం చేసి సాయిరాంను చిరంజీవిగా నిలిపారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్‌టిపి నాయకులు సొయం వీరభద్రం రాష్ట్ర గిరిజన అధ్యక్షుడు, సత్తుపల్లి నియోజకవర్గ కోఆర్డినేటర్లు డేవిడ్ (రిటైర్డ్DSP) జెన్నారెడ్డి, నర్సింహారెడ్డి, బి.శ్యామ్ సుధాకర్ అడ్వకేట్ ,శీలం చెన్నారెడ్డి కిషోర్ లు వారి కుటుంబాన్ని పరామర్శించి శ్రద్ధాంజలి ఘటించారు ఆరుగురికి ప్రాణదానం చేసిన దేవుడులాంటి సాయిరాం ఆత్మ శాంతించాలని భగవంతుడు ఆ కుటుంబానికి ఆత్మ స్థైర్యం ఇవ్వాలని కోరుతూ ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాన్నామన్నారు.