బురదలో దొర్లుతున్న బాలీవుడ్ బ్యూటీ.. ఆ మాటలు సీరియస్‌గా తీసుకుని..

by sudharani |
బురదలో దొర్లుతున్న బాలీవుడ్ బ్యూటీ.. ఆ మాటలు సీరియస్‌గా తీసుకుని..
X

దిశ, సినిమా : పాపులారిటీ పెంచుకునేందుకు సెలబ్రెటీలు చేసే వీర విన్యాసాలు ఈ మధ్య సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో ప్రైవేట్ పార్ట్స్‌ చూపించేందుకు కూడా వెనకాడటం లేదు. అయితే ఈ విన్యాసాలపై కొందరు ఛీ అంటుంటే.. మరికొందరు మాత్రం ఆహా ఓహో అంటూ ఆనందిస్తున్నారు. కాగా ప్రస్తుతం అలాంటి ఒక విన్యాసంతో బాలీవుడ్ నటి షెహ్నాజ్ గిల్ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. బురదలో దొర్లుతూ ఎంజాయ్ చేస్తున్న పిక్స్ ఇన్‌స్టాలో షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అయితే ఈ ఫొటోలు సరదా కోసం తీసుకుందో లేక పాపులారిటీ కోసమో తెలీదు కానీ.. 'తెరి మిట్టీ మే మిల్ జావా' అనే సాంగ్‌ను సీరియస్‌గా తీసుకుని ఈ రూపంలో మట్టిలో ఎంజాయ్ చేశానని చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story