Sriram Sagar Project: శ్రీరాం సాగర్ ప్రాజెక్టు 34 గేట్ల ఎత్తివేత

by samatah |   ( Updated:2022-07-13 09:27:51.0  )
34 Gates Of Sriram Sagar Project Lifted
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: 34 Gates Of Sriram Sagar Project Lifted| శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట‌కు భారీగా వరరద పెరిగింది. గోదావరి, మంజీర నదుల ద్వారా వరద ఎక్కువ కావడంతో పాటు నిర్మల్ జిల్లాలోని ప్రాజెక్టు గెట్లను ఎత్తివేయడంతో ఎస్సారెస్పీకి ఇన్ ప్లో 3,60,515 క్యసేక్కులు నీరు వచ్చి చేరింది. దీంతోబుధవారం ఉదయం 34 గేట్లను అధికారులు ఎత్తివేశారు.

వరద గేట్ల నుంచి గోదావరికి 3,53,548 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం శ్రీరాం సాగర్ ప్రాజెక్టు‌లో 90 టీఎంసీలకు గాను 75.145 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల పోచంపాడు ప్రాజెక్టు‌లో గంట గంటకు వరద పెరుగుతుంది. ప్రాజెక్టు‌ను బ్యాలెన్సింగ్ గా ఉంచేందుకు అధికారులు సూమారు రెండున్నర లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. మంగళవారం రాత్రి 10 వరకు 26 గేట్లు తెరిచి ఉంచిన అధికారులు, వరద గేట్ల ను రాత్రి 12 గంటలకు 30 కి పెంచి 1,11,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఇన్ ప్లో పేరుగడంతో మరో 4 వరద గేట్లను అధనంగా తెరిచి మొత్తంగా రెండున్నర క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. శ్రీ రాం సాగర్ ప్రాజెక్టు42 గేట్లు ఉండగా ప్రస్తుతానికి అధికారులు 34 గేట్లను మాత్రమే ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఐదు లక్షల ఇన్ ప్లో వస్తే మరిన్ని గేట్లను తెరిచేందుకు యత్నించినా అవి మోరాయించే అవకాశం ఉంది. ప్రాజెక్టు గేట్ల మరమ్మత్తులు జరుగుతున్న సమయంలోనే ప్రాజెక్టులోకి వరద రావడం మొదలైంది.


Also Read: గేట్లను ఎత్తి నీటిని వదిలిన అధికారులు... మునిగిపోయిన గుండి గ్రామం

Advertisement

Next Story