ఉత్తరాఖండ్‌లో 27శాతం ఎమ్మెల్యేలు నేరచరితులే: ఏడీఆర్ నివేదిక

by Harish |
ఉత్తరాఖండ్‌లో 27శాతం ఎమ్మెల్యేలు నేరచరితులే: ఏడీఆర్ నివేదిక
X

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో గెలుపొందిన అభ్యర్థుల్లో 27శాతం నేరచరితులేనని పోల్ రిఫార్మ్ అడ్వకసీ గ్రూప్ తెలిపింది. తాజాగా ఉత్తరాఖండ్ ఎలక్షన్ వాచ్ అండ్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ మొత్తం 70 మంది గెలిచిన అభ్యర్థుల స్వీయ ప్రమాణ పత్రాలను విశ్లేషించింది. 2022 లో గెలిచిన 70 మంది అభ్యర్థుల్లో 19 మంది(22 శాతం) తమ పైన క్రిమినల్ కేసులు ఉన్నాయని తెలిపారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 70 మంది ఎమ్మెల్యేల్లో 22 మంది(31 శాతం) తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటించారు' అని ఏడీఆర్ పేర్కొంది. తాజాగా గెలుపొందిన వారిలో 10 మంది తీవ్రమైన కేసులు ఉన్నాయని ప్రకటించుకున్నట్లు తెలిపారు. వీరిలో 8 మంది బీజేపీ నుంచి, 8 మంది కాంగ్రెస్ నుంచి, ఇద్దరు బీఎస్పీ, మరో ఇద్దరు స్వతంత్రులు ఉన్నారని వెల్లడించింది. తాజాగా గెలుపొందిన వారిలో 58 మంది కోటిశ్వరులేనని పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed