- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పాక్ ప్రధానికి పదవి గండం.. రెబల్‌గా మారిన 24 మంది ఎంపీలు
ఇస్లామాబాద్ : పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు పదవి గండం తప్పేలా లేదు. అవిశ్వాస తీర్మానానికి ముందే పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ (పీటీఐ)కు చెందిన 24 మందిలు రెబల్‌గా మారి ప్రతిపక్షంతో జోడి కట్టేందుకు సిద్ధపడ్డారు. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌కు ముందు వీరంతా ఇస్లామాబాద్‌లోని సింధ్ హౌస్‌లో ఆశ్రయం పొందారు. ఇది ప్రభుత్వ అధికారిక భవనం. సింధ్ ప్రావిన్స్‌లో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పార్టీ ముస్లి లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) అధికారంలో ఉండగా, రెబల్ ఎంపీలు ఇక్కడే తలదాచుకున్నారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన రోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసే ఎంపీలపై ఎలాంటి చర్యలు తీసుకోబోనని ఇమ్రాన్ ఖాన్ హామీ ఇస్తే తిరిగి వచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు రెబల్ ఎంపీ రాజా రియాజ్ తెలిపారు.
కాగా, అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగాలంటే మోషన్ డాక్యుమెంట్ పై 68 మంది ఎంపీల సంతకాలు అవసరం. అయితే, ప్రతిపక్ష పార్టీలకు చెందిన 100 మంది సభ్యులు ఇప్పటికే సంతకం చేశారు. ప్రస్తుతం 342 మంది సభ్యులున్న పాక్ పార్లమెంటులో 172 మంది ఇమ్రాన్‌కు వ్యతిరేకంగా ఓటు వేస్తే ప్రధాని కుర్చీ నుంచి ఆయన దిగిపోవాల్సిందే.