వీల్‌చైర్‌లో బ్యాక్‌ఫ్లిప్.. దేశంలోనే మొద‌టి రికార్డ్‌! (వీడియో)

by Sumithra |   ( Updated:2023-10-10 16:21:57.0  )
వీల్‌చైర్‌లో బ్యాక్‌ఫ్లిప్.. దేశంలోనే మొద‌టి రికార్డ్‌! (వీడియో)
X

దిశ‌, వెబ్‌డెస్క్ః విభిన్న ప్ర‌తిభావంతుల వీళ్లు. అవ‌య‌వ‌లోపం ఉంటేనేమీ..? అనుకున్న‌ది ఏదైనా సాధించ‌గలిగిన ప్ర‌తిభ ఉన్నోళ్లు. అందుకే, 12 ఏళ్ల బాలుడు యూకేలో ఇదివ‌ర‌కు ఎవ్వ‌రూ చేయ‌ని విధంగా వీల్ చైర్‌లో బ్యాక్‌ఫ్లిప్ చేసిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. మెదడులో ద్రవం పేరుకుపోయే స్పినా బిఫిడా, హైడ్రోసెఫాలస్ అనే వ్యాధితో జన్మించిన బెంజమిన్ స్లీట్ జీవితాంతం వీల్‌చైర్‌లో ఉండాల్సిందే. అయితే, అతనికి 8 ఏళ్ల వయసున్న‌ప్పుడు ఓ స్కేట్‌బోర్డ్ ఈవెంట్‌లో వీల్‌చైర్ మోటార్ క్రాఫ్ట్ క్రాస్ (WCMX)తో పరిచయం ఏర్ప‌డింది. త‌ర్వాత స్పెష‌లిస్ట్ స్కేట్ చైర్ గురించి తెలిసింది. 13 సంవ‌త్స‌రాల వ‌య‌సులో బ్యాక్‌ఫ్లిప్ చేసి, యూకేలో ఇలా చేసిన మొద‌టి స్త్రీగా గుర్తింపు తెచ్చుకొని, ప్రస్తుత మహిళల ప్రపంచ WCMX ఛాంపియన్‌గా ఉన్న లిల్లీ రైస్ ఈ ప్ర‌త్యేక వీల్ చైర్‌ని బెంజ‌మిన్‌కు ప‌రిచ‌యం చేసింది. 5,500 పౌండ్ల స్పాన్స‌ర్‌షిప్‌ పొందిన‌ బెంజమిన్ కుటుంబం అతనికి ప్రత్యేకమైన ఈ వీల్ చైర్‌ను కొన్నారు. ఇక‌, నెలల కాలం ప్రాక్టీస్, ఎన్నో ప్రయత్నాల తర్వాత బెంజమిన్ ఏప్రిల్ ప్రారంభంలో స్కేట్ పార్క్‌లో బ్యాక్‌ఫ్లిప్ చేయగలిగాడు.

Advertisement

Next Story

Most Viewed