కడిగేసిన కాగ్.. 12 సంస్థలు.. రూ. 85 వేల కోట్ల అప్పు

by Nagaya |
కడిగేసిన కాగ్.. 12 సంస్థలు.. రూ. 85 వేల కోట్ల అప్పు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని ఏడు ప్రభుత్వ రంగ సంస్థలు, మూడు స్వయంప్రతిపత్తి సంస్థలు గడిచిన నాలుగేండ్లలో రూ. 85 వేల కోట్ల అప్పు చేశాయి. వీటిలో రూ. 70 వేల కోట్లకు ప్రభుత్వం పూచీకత్తు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుల కోసం ఈ అప్పులు చేసినట్లు కాగ్​ వెల్లడించింది. అయితే రుణాలు తీసుకుంటామని శాసనసభకు చెప్పుతున్నా వాటికి సంబంధించిన ఖచ్చితమైన అంశాలను మాత్రం వెల్లడించడం లేదని కాగ్​ తప్పు పట్టింది.

ఒక్క ఏడాది రూ.16 వేల కోట్లు

బడ్జెట్​తో సంబంధం లేకుండా సేకరించిన రుణాలపై కాగ్​ వివరాలు సేకరించినట్లు వెల్లడించింది. దీనికి కేవలం 12 సంస్థలు మాత్రమే వివరాలు ఇచ్చాయని, 2020లో ఈ సంస్థలు రూ. 16,077 కోట్ల రుణాలు తీసుకున్నాయని, మొత్తం నాలుగేండ్లలో రూ. 85,380 కోట్లు తీసుకున్నాయని వెల్లడించారు. అయితే వీటికి సంబంధించిన వడ్డీలు, నెలవారీ కిస్తీలను మాత్రం రాష్ట్ర బడ్జెట్​ నుంచి చెల్లిస్తున్నట్లు స్పష్టం చేసింది.

Advertisement

Next Story