TG Assembly: ఇది చరిత్రాత్మకమైన రోజు.. అసెంబ్లీలో మంత్రి దామోదర

by Shiva |
TG Assembly: ఇది చరిత్రాత్మకమైన రోజు.. అసెంబ్లీలో మంత్రి దామోదర
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ (Assembly) సమావేశాల్లో భాగంగా ఐదో రోజు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తరఫున మంత్రి దామోదర రాజనర్సింహ (Minister Damodara Rajanarsimha) ఎస్సీ వర్గీకరణ హేతుబద్ధీకరణ బిల్లును (SC Category Rationalization Bill) ప్రవేశ పెట్టారు. ఈ నేపథ్యంలో ఆయన సభలో మాట్లాడుతూ.. సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఎప్పుడూ కట్టబడి ఉంటుందని అన్నారు. ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని తెలిపారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ (BR Ambedkar), బాబు జగ్జీవన్ రామ్ (Babu Jagjivan Ram) యువతకు ఆదర్శమని అన్నారు. ఫిబ్రవరి 4న సామాజిక న్యాయం (Social Justice) దినంగా ప్రకటించారని గుర్తు చేశారు.

చాతుర్వర్ణ వ్యవస్థ క్రమంగా పంచమ వ్యవస్థగా మారింది కామెంట్ చేశారు. పంచములు అస్పృశ్యత, అంటరానితనానికి గురయ్యారని అన్నారు. కుల వ్యవస్థ భారతదేశాన్ని బలహీనపరుస్తోందిని ఆనాడు గాంధీజీ (Gadhiji) అన్నారని పేర్కొన్నారు. సామాజిక న్యాయం కోసం గాంధీ, అంబేద్కర్, పూలే పోరాడాని కొనియాడారు. కుల వ్యవస్థ కారణంగా దళితులు వివక్షకు గురయ్యారని కామెంట్ చేశారు. వివక్షను రూపుమాపేందుకు రిజర్వేష్లన్లను తీసుకొచ్చారని తెలిపారు. ఆ రిజర్వేషన్ల ఫలాలు అందరికీ అందాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎస్సీ వర్గీకరణ జరపాలని మొదటి లోకూర్ కమిటీ (Lokur Committee) 1965లోనే సూచించిందని పేర్కొన్నారు. మొదట పంజాబ్‌ (Punjab)లో ఎస్సీ వర్గీకరణ అమలైందని దామోదర రాజనర్సింహ అన్నారు.

Next Story

Most Viewed