ఈ 10 యాప్స్‌ను ఫోన్‌లో నుండి తీసేయండి

by Harish |
ఈ 10 యాప్స్‌ను ఫోన్‌లో నుండి తీసేయండి
X

దిశ, వెబ్‌డెస్క్: టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది సమస్యలు కూడా అలాగే పెరుగుతున్నాయి. స్మార్ట్ ఫోన్ యుగంలో ప్రతి ఒక్కరి వ్యక్తిగత వివరాలు, డేటా మొత్తం మన స్మార్ట్ ఫోన్‌లోనే ఉంటుంది. అలాంటి ఫోన్‌లోకి చొరబడి వ్యక్తిగత వివరాలు, పాస్‌వర్డ్‌లను దొంగలిస్తున్న సంఘటనలు చాలా జరుగుతున్నాయి. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా మన సమాచారాన్ని హ్యాకర్స్ చోరి చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా ప్రమాదకరమైన 10 యాప్‌లను Google ప్లే స్టోర్‌లో గూగుల్ గుర్తించింది. ఈ యాప్స్ వినియోగదారుల లోకేషన్, ఇమెయిల్, ఫోన్ నంబర్‌లు, పాస్‌వర్డ్‌లను సేకరిస్తున్నట్లుగా కనుగొన్నారు. ఈ నిషేధిత యాప్‌లు ఇప్పటి వరకు 60 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్ అయ్యాయి. భద్రతా కారణాల దృష్ట్యా వాటిని వెంటనే అన్‌ఇన్‌స్టాల్ చేయాలని గూగుల్ సూచించింది.

Google Play Store ద్వారా నిషేధించబడిన 10 యాప్‌లు

1. Smart kit 360

2. QR & Barcode Scanner

3. Wi-Fi Mouse

4. Al-Moazin Lite

5. Qibla Compass - Ramadan 2022

6. Simple Weather & Clock Widget

7. Handcent Next SMS- Text With MMS

8. Speed Radar Camera

9. Full Quran MP3-50 Languages & Translation Audio

10. Audiosdroid Audio Studio DAW

Advertisement

Next Story

Most Viewed