- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాజల్ పెళ్లిలో తెలుగు సంప్రదాయం?
దిశ, వెబ్‌డెస్క్: బిజినెస్‌మ్యాన్ గౌతమ్ కిచ్లూని పెళ్లాడి కాజల్ అగర్వాల్ కాస్త మిసెస్ గౌతమ్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే కాజల్ ఫ్యామిలీ పంజాబీలు, గౌతమ్ ఫ్యామిలీ కశ్మీరీలు. మరి వారి పెళ్లిలో తెలుగు సంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చిందని ఆశ్చర్యపోకండి. కావాలనే వారి పెళ్లిలో తెలుగు సంప్రదాయమైన జీలకర్ర బెల్లాన్ని ఉపయోగించినట్లు స్వయంగా కాజల్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా వెల్లడించింది. దక్షిణ భారతదేశంలోనే తమ ప్రేమకు పునాది పడటంతో అందుకు గుర్తుగా తెలుగు హిందువులు పాటించే ఈ జీలకర్ర బెల్లం సంప్రదాయాన్ని తమ పెళ్లిలో పాటించినట్లు ఆమె ప్రకటించారు.
పురోహితులు వేదమంత్రాలు చదువుతుండగా జీలకర్ర, బెల్లంతో చేసిన ముద్దను తమలపాకు మీద పెట్టి, ఒకరి తల మీద ఒకరు పెట్టుకుని కళ్లలోకి కళ్లు పెట్టుకుని చూసుకుంటే, ఆ భార్యాభర్తల బంధం కష్టనష్టాల్లో కూడా కలకాలం నిలిచి ఉంటుందని చెబుతూ, వారు జీలకర్ర బెల్లం పెట్టుకున్న ఫొటోను కాజల్ షేర్ చేసింది. తెలుగు భాషలో చాలా సినిమాల్లో నటించడమే కాకుండా అభిమానులను సంపాదించుకుని, ఇక్కడి సంప్రదాయాన్ని తన పెళ్లిలో కూడా పాటించడాన్ని ఆమె తెలుగు అభిమానులు కొనియాడుతున్నారు. తమ క్రష్ కాజల్‌కు పెళ్లైందన్న బాధలో ఉన్న తెలుగు యువతకు తమ సంప్రదాయాన్ని ఇలా గౌరవించినందుకు ఒకింత ఆనందం కలుగుతోంది.