మా పిల్లలు ఎయిర్ పోర్టులో ఉన్నారు.. రప్పించండి

by srinivas |
మా పిల్లలు ఎయిర్ పోర్టులో ఉన్నారు.. రప్పించండి
X

దిశ, ఏపీ బ్యూరో: రెండ్రోజులుగా ఖజిగిస్థాన్ ఎయిర్ పోర్ట్ లో తెలుగు విద్యార్థులు చిక్కుకుపోయారు. వైద్య విద్య కోసం ఖజిగిస్తాన్‌కు వెళ్లిన ఆంధ్ర, తెలంగాణకు చెందిన రెండు వేల మంది విద్యార్థులు కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆన్‌లైన్‌లో పరీక్షలు పూర్తి చేశారు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో స్వస్థలాలకు పంపేందుకు ఒక్కో విద్యార్థి నుంచి 45 వేల రూపాయలను కళాశాల యాజమాన్యం వసూలు చేసింది. దీంతో తెలుగు విద్యార్థులంతా ఆనందంగా ఎయిర్ పోర్టుకు బయల్దేరారు. ఎయిర్ పోర్ట్ కు చేరగానే ఇండియాకు విమానాలు లేవని ఎయిర్ పోర్ట్ అధికారులు చెప్పారు. దీంతో రెండు రోజుల నుంచి ఎయిర్ పోర్ట్ లోనే విద్యార్థులు గడుపుతున్నారు. అటు కళాశాలలో లేక ఇటు స్వస్థలాలకు చేరక ఎయిర్ పోర్ట్ లో చిక్కుకుపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని తమ పిల్లలను స్వస్థలాలకు చేర్చాలని వారి తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed