- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇన్నోవేషన్ అండ్ కేపబిలిటీస్ సెంటర్ ప్రారంభించిన టెల్‌స్ట్రా.. ఎందుకంటే ?
దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ టెలీ కమ్యూనికేషన్ అండ్ టెక్ సంస్థ టెల్‌స్ట్రా హైదరాబాద్‌లో తన ఆవిష్కరణ, సామర్థ్య కేంద్రాన్ని ప్రారంభించింది. మొత్తం 43,372 చ.అ స్థలంలో ఏర్పాటైన ఈ ఇన్నోవేషన్ అండ్ కేపబిలిటీస్ సెంటర్(ఐసీసీ) అధిక పనితీరును కనబరిచే ప్రత్యేక సాఫ్ట్ ఇంజనీరింగ్ హబ్‌గా నిలిస్తుందని కంపెనీ అభిప్రాయపడింది. అదేవిధంగా కంపెనీ వినియోగదారులకు నేరుగా కొత్త ఆవిష్కరణలను అందించేందుకు ప్రత్యేక టెక్ వినియోగదారు ఇంజనీరింగ్ బృందం ఈ సెంటర్‌లో పనిచేస్తారని కంపెనీ స్పష్టం చేసింది. ఆస్ట్రేలియాకు చెందిన టెల్‌స్ట్రా కంపెనీ పూణెలో సైతం ఐసీసీ సెంటర్‌ను ప్రారంభించింది.
అలాగే, బెంగళూరులో సంస్థకు చెందిన నెట్‌వర్క్ అండ్ ప్రోడక్ట్ ఇంజనీరింగ్ ల్యాబ్‌ను మొదలుపెట్టింది. ‘భారత్‌లో టెల్‌స్ట్రా డిజిటల్‌గా మారుతున్న క్రమంలో భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నైపుణ్యం, ఇన్నోవేషన్ కేంద్రంగా ఉండాలని లక్ష్యంగా ఉంది. దేశీయంగా విస్తరణ ద్వారా ప్రయోజనాలు అందించడమే కాకుండా మరింత శక్తివంతమైన సేవలకు వీలవుతుంది. తమ వ్యాపారాలు వినియోగదారులకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, పరిష్కారాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు’ టెల్‌స్ట్రా ఇండియా ఎండీ అరుణ్ కుమార్ చెప్పారు.