షాకింగ్.. అర్ధరాత్రి నటి కారును వెంబడించి అసభ్యకరంగా..

by Sumithra |
షాకింగ్.. అర్ధరాత్రి నటి కారును వెంబడించి అసభ్యకరంగా..
X

దిశ, సినిమా : టెలివిజన్ యాక్ట్రెస్ ప్రాచీ టెహ్లాన్ తన లైఫ్‌లో జరిగిన భయానక సంఘటన గురించి వివరించింది. ఫిబ్రవరిలో భర్త రోహిత్ సరోహాతో కలిసి ఫ్యామిలీ ఫంక్షన్‌కు వెళ్లి వస్తున్న క్రమంలో నలుగురు దుండగులు తమ కారును వెంబడించారని తెలిపింది. చాలా దారుణంగా బిహేవ్ చేశారని, అసభ్యంగా మాట్లాడారని తెలిపిన ఆమె.. తెల్లవారుజామున రెండు గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు చెప్పింది.

అలాంటి వారిని వదిలిపెట్టకూడదని భావించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. ఢిల్లీలో పుట్టిపెరిగిన ప్రాచీ.. సిటీ ఎప్పుడూ సేఫ్ కాదని అభిప్రాయపడింది. కారులో కేవలం నేను మాత్రమే కాదు హజ్బెండ్ ఉన్నా సరే తమ సొసైటీలోకి ప్రవేశించి గోలగోల చేశారంది. తాగి రోడ్లమీద వెళ్లేవారిని భయపెట్టడం, దాడి చేయడం సమంజసం కాదన్న ప్రాచీ.. ఇలాంటి నేరాలకు చాలా బలమైన శిక్ష వేయాలంది. తమపై అటాక్ చేసే వారెవరో? ఎలాంటి వెపన్స్ యూజ్ చేస్తారోనని భయపడిపోయానని తెలిపింది.

Advertisement

Next Story