- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇకనుండి గ్రేటర్‌లో టెలీ మెడిసిన్
దిశ, తెలంగాణ బ్యూరో : గ్రేటర్ పరిధిలోని కొవిడ్పేషంట్లతో పాటు, కరోనా లక్షణాలపై భయాందోళనలకు గురయ్యే ప్రజలకు అవసరమైన వైద్య సలహాలు ఇచ్చేందుకు టెలీ మెడిసిన్ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. జీహెచ్ఎంసీ కొవిడ్ సెంటర్ద్వారా కొవిడ్ పాజిటివ్, లక్షణాలు కలిగిన వ్యక్తులు ఉచితంగా వైద్య సలహాలను పొందేందుకు అవకాశం ఉంది. ప్రస్తుత సమయంలో ప్రజలెవరూ ఆందోళన చెందకుండా ఇంటి నుంచి వైద్య సమాచారం కోసం సంప్రదించవచ్చని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్‌లో కొవిడ్సంబంధిత వైద్య సహాయాన్ని, కొవిడ్ పాజిటివ్ వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మందులు తదితర సలహాలు సూచనలను అందించే సేవలను జీహెచ్ఎంసీ కొవిడ్కంట్రోల్ రూమ్ నుంచి అందించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు.
కొవిడ్ కంట్రోల్‌రూం నెంబర్ద్వారా సంప్రదించేందుకు 20 మంది డాక్టర్లను ప్రత్యేకంగా నియమించింది. వీరు రెండు షిప్టుల్లో పనిచేయనున్నారు. ప్రతీ రోజు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ వైద్యులు అందుబాటులో ఉంటారు. ఇక నుంచి గ్రేటర్‌పరిధిలో కొవిడ్ సహాయం కోసం 104కు వచ్చే కాల్స్‌ను కూడా జీహెచ్ఎంసీ కంట్రోల్ రూం నెంబర్ కే ట్రాన్స్ఫర్చేయనున్నారు. ఇందుకు సంబంధించి వైద్యులకు సోమవారం ప్రత్యేకం ఓరియంటేషన్ నిర్వహించారు. జీహెచ్ఎంసీ ద్వారా కొవిడ్సహాయానికి 040 – 21111111 అనే నెంబర్‌లో సంప్రదించాలని వైద్యశాఖ కార్యదర్వి రిజ్వీ సూచించారు. జీహెచ్ఎంసీలో సోమవారం ప్రారంభించిన టెలీ మెడిసిన్స్ సర్వీస్ డాక్టర్లతో వైద్యశాఖ ఓఎస్డీ గంగాధర్, కమిషనర్లోకేష్కుమార్మాట్లాడారు. కొవిడ్ పై వైద్య సలహాలు, సూచనలతో పాటు మెడికల్ కిట్స్ కోసం ఈ కాల్ సెంటర్ పనిచేస్తుంది.
సర్కిల్ అధికారులకు బాధ్యతల అప్పగింత
హోం ఐసోలేషన్‌లో ఉన్న వ్యక్తులకు మెడికల్, కొవిడ్ కిట్స్‌ను అందించే బాధ్యతలను ప్రభుత్వం జీహెచ్ఎంసీకి అప్పగించింది. కొవిడ్ కిట్ల కోసం బల్దియా కంట్రోల్‌రూమ్‌కు నగరం పలు చోట్ల నుంచి కాల్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొవిడ్కిట్లను అందించే బాధ్యతలను డిప్యూటీ కమిషనర్లు, ఏఎంఓహెచ్ లకు అప్పగించారు. జీహెచ్ఎంసీలోని 30 సర్కిళ్ల పరిధిలో కొవిడ్పేషంట్ఏరియాను బట్టి సంబంధిత డీసీ, ఏఎంఓహెచ్‌లే కిట్స్‌ను అందించనున్నారు. హోం ఐసోలేషన్‌లో ఇబ్బందులు ఎదుర్కోవడం, పేషంట్లకు ఇండ్ల వద్ద ఐసోలేషన్‌లో ఉండే సౌకర్యం లేకపోతే సర్కిల్పరిధిల్లో ఏర్పాటు చేసే కొవిడ్కేర్సెంటర్లలో చేర్చి వైద్య సహాయాన్ని అందించనున్నారు.