- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
జిల్లాలో టెలీమెడిసిన్ హెల్ప్‌లైన్
దిశ, మెదక్: కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లాలోని ప్రజలు ఎలాంటి ఆరోగ్య పరమైన సమస్యలతో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని ప్రజలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారా తగు సలహాలు సూచనలు అందించేందుకు గాను జిల్లా యంత్రాంగం టెలీమెడిసిన్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ హనుమంతరావు లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఆరోగ్యకరమైన సమస్యలు ఉంటే కాల్ సెంటర్ నెంబర్ 7093324551కు ఫోన్ చేయాలని సూచించారు. వైద్యులు సలహాలు, సూచనలు ఇస్తారన్నారు. కాల్ సెంటర్‌లో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు డాక్టర్స్ అందుబాటులో ఉంటారని తెలిపారు. మెడికల్ ఆఫీసర్, సహాయ సిబ్బంది టెలీ కాన్ఫరెన్స్ ద్వారా డాక్టర్‌లకు కనెక్ట్ చేస్తారు.
Tags : Tele Medicine, Helpline, District, medak, collector hanumantha rao