- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షర్మిలను కలువలేదు.. ఆ వార్తలన్నీ అవాస్తవం: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్లారిటీ
దిశ, వెబ్‌డెస్క్: ఖమ్మం మాజీ ఎంపీ, బీఆర్ఎస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సొంత ప్రభుత్వంపైనే బహిరంగంగా విమర్శలు చేయడంతో ఆయన పార్టీ మారుతారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆ వార్తలకు బలం చేకూర్చేలా ఖమ్మంలో జిల్లాలో వరుసగా ఆయన అభిమానులు, కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. పార్టీలో తనకు, తనకు అనుచరులకు అన్యాయం జరిగిందని.. ఇన్నాళ్లు ఓపిక పట్టానని.. ఇకపై మాత్రం తగ్గదేలేదు అని పొంగులేటి బహిరంగంగానే కామెంట్లు చేయడంతో ఆయన త్వరలోనే కారును వీడుతారని పొలిటికల్ సర్కి్ల్స్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వంపై పొంగులేటి తీవ్ర అసంతృప్తితో ఉండటంతో ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అలర్ట్ అయ్యాయి.
ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తం ప్రభావం చూపగలిగే సత్తా ఉన్న పొంగలేటిని పార్టీలో చేర్చుకుంటే వచ్చే ఎన్నికల్లో ప్లస్ అవుతోందని.. ఎలాగైనా పొంగులేటిని పార్టీలోకి తీసుకువచ్చేందుకు చర్చలు జరుపుతున్నారు. మొన్నటి వరకు పొంగులేటి కారుకు గుడ్ బై చెప్పి కమలం గూటికి చేరుతారని.. ఖమ్మంలో భారీ ఎత్తున సభ ఏర్పాటు చేసి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో బీజేపీ కండువా కప్పుకుంటారని తెలంగాణ రాజకీయాల్లో ప్రచారం జరిగింది. ఇదిలా ఉండగానే మరో ప్రచారం తెరపైకి వచ్చింది. వైఎస్ ఫ్యామిలీతో మంచి సంబంధాలు ఉన్న పొంగులేటి వైఎస్సార్టీపీలో చేరుతున్నట్లు వార్తలు వినిపిస్తు్న్నాయి. షర్మిల ఆధ్వర్యంలో వైఎస్సార్టీపీలో పొంగులేటి చేరిక ఖరారు దాదాపు ఫిక్స్ అయ్యిందని.. త్వరలోనే ఆయన పార్టీలో చేరుతారంటూ వైఎస్సార్టీపీ కార్యకర్తలు ప్రచారం చేస్తు్న్నారు.
వైఎస్సార్టీపీలో చేరిక గురించి చర్చించేందుకు పొంగులేటి వైఎస్ షర్మిల, విజయమ్మలతో భేటీ కూడా అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అలర్ట్ అయ్యారు. షర్మిలతో భేటీ అయినట్లు వస్తోన్న వార్తలపై తాజాగా ఆయన రియాక్ట్ అయ్యారు. ఇటీవల తాను షర్మిలను కలిశానన్న వార్తల్లో నిజం లేదని.. ఆ వార్తలన్నీ అవాస్తవమని ఆయన కొట్టి పారేశారు. వైఎస్ షర్మిలను గత జూలైలో కలిశానని.. అప్పుడు తన కూతురు పెళ్లి శుభలేఖ ఇవ్వడానికి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లానని క్లారిటీ ఇచ్చారు. దీంతో పొంగులేటి వైఎస్సార్టీపీలో చేరుతున్నారన్న వార్తలపై ఓ క్లారిటీ వచ్చింది.
Read more: