ఫస్ట్ క్యాబినెట్ భేటీలో సిక్స్ గ్యారంటీస్

by GSrikanth |   ( Updated:2023-12-03 10:33:31.0  )
ఫస్ట్ క్యాబినెట్ భేటీలో సిక్స్ గ్యారంటీస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని తేలిపోవడంతో సన్నాహాల్లో కాంగ్రెస్ నిమగ్నమైంది. ఎల్బీ స్టేడియంలో డిసెంబరు 9న ఉదయం 11.00 గంటలకు ప్రమాణ స్వీకారోత్సవం ఉంటుందని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి గతంలో పలు సందర్భాల్లో ప్రకటించారు. అదే రోజున సోనియాగాంధీ జన్మదినం కూడా కావడం గమనార్హం. అదే రోజున 2009లో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం తరఫున అప్పటి హోం మంత్రి చిదంబరం ఢిల్లీ నుంచి లాంఛనంగా ప్రకటన చేశారు. ఇన్ని ప్రత్యేకతలున్న ఆ రోజు కాంగ్రెస్‌కు ప్రత్యేకం.

ప్రభుత్వం కొలువుతీరిన తర్వాత తొలి మొదటి క్యాబినెట్ భేటీలోనే సిక్స్ గ్యారంటీస్‌కు చట్టబద్ధత కల్పించడంపై నిర్ణయం జరగనున్నది. ఇదే విషయాన్ని ప్రస్తుత సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సహా పలువురు కాంగ్రెస్ నేతలు సైతం ఇదే విషయాన్ని ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రకటించారు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవం జరిగిన వెంటనే తొలి సంతకం ఈ సిక్స్ గ్యారంటీస్‌పైనే ఉంటుందని కూడా కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు.

కౌంటింగ్ ప్రాసెస్ పూర్తయిన నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేతలంతా ఢిల్లీ బాట పట్టనున్నారు. ఏఐసీసీ నాయకత్వంతో చర్చల అనంతరం ముఖ్యమంత్రి, మంత్రులు ఎవరుండాలనేదానిపై నిర్యయం జరగనున్నది. ఇదంతా కొలిక్కి వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారోత్సవం, ఆ తర్వాత తొలి సంతకం, ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్, ప్రయారిటీ అంశాలు తదితరాలన్నింటిపై క్లారిటీ రానున్నది. ప్రజలకు హామీ ఇచ్చినట్లుగా వీలైనంత తొందరగా సిక్స్ గ్యారంటీస్ ఫలాలను అందించడమే ఆ పార్టీ ప్రయారిటీగా ఉండనున్నది.

Advertisement

Next Story

Most Viewed