- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భవిష్యత్‌లో ఫుట్ పాత్‌ల మీద పడుకునే గతి వస్తుంది: వీహెచ్
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం పేదల భూములు, అసైన్ భూములను లాక్కొని వెంచర్లకు అమ్మేస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు విమర్శించారు. ఈ మేరకు ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఇందిరా గాంధీ హయాంలో ఇచ్చిన భూములు ఆన్లైన్‌లో ప్రభుత్వం విక్రయిస్తుందని, ఈ మేరకు ఖానాపూర్, కోకపేటలో భూములు అమ్మేసిందని తెలిపారు. ఎకరాకు 100 కోట్లు అమ్మే పరిస్థితి వచ్చిందని, భవిష్యత్‌లో ఫుట్ పాత్ మీద పడుకునే పరిస్థితి వస్తుందన్నారు.
కేసీఆర్ ప్రతి ఒక్కరికి భూమి, డబుల్ బెడ్ రూమ్, ఇళ్ల స్థలం ఉన్నవారికి డబ్బులు అన్నాడని, కానీ మోసం చేశారని మండిపడ్డారు. మోడీ, కేసీఆర్‌ల ప్రభుత్వం.. భూస్వాములకు, కార్పొరేట్లకు ఉపయోగపడుతుందని, పేదలను పట్టించుకోవడం లేదని అన్నారు. సోనియా గాంధీ సభ తరువాత ఈ నెల 19, 20 తేదీల్లో అన్ని పార్టీలను పిలుస్తానని చెప్పారు. దళిత బంధు ఎవరికీ ఇచ్చారో అడుగుతామని, పేదల భూములు వారికి ఇచ్చే వరకు పోరాడతామని, పేద వారికి కాంగ్రెస్ ఉంటుందని వెల్లడించారు.