- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చిరునవ్వుతో సమాధానం చెప్పే ఏకైక నేత వైఎస్ఆర్: రేవంత్ రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో: వైఎస్ రాజశేఖరరెడ్డి ఒక తరం.. ఒక అనుభవం.. అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అభివర్ణించారు. అత్యంత పిన్న వయసులో 34 ఏళ్లలో ఉమ్మడి రాష్ట్రానికి పీసీసీ అధ్యక్షుడు అయ్యారన్నారు. ఆయన వేసిన పునాదులే కాంగ్రెస్‌ను నడిపిస్తున్నాయన్నారు. సీఎం పీఠం పొందేందుకు ఆయన 20 ఏళ్ళు ఎదురుచూశారన్నారు. వైఎస్ అనుభవాలు, రాజకీయంగా ఎదుర్కొన్న ఒడిదుడుకులు అందరికీ ఆదర్శనీయమన్నారు. అసెంబ్లీలో విపక్ష సభ్యులు లేవనెత్తిన అంశాలపై చిరునవ్వుతో సమాధానం ఇచ్చేవారన్నారు. నూతన సభ్యులను ఆయన ఎంతో ప్రోత్సహించేవారన్నారు. 21 శతాబ్దంలో వైఎస్, ఆయన ఆశయాలను కొనసాగిస్తున్న కేవీపీలు ఒకటేనని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తామన్నారు.
సీఏల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. వైఎస్సార్ దగ్గర పనిచేయాలని తపించానన్నారు. కార్యకర్తలతో ప్రేమ ఎలా? పెంచుకోవాలో వైఎస్సార్ దగ్గర నేర్చుకున్నానని చెప్పారు. రాష్ట్ర విభజన జరిగినా.. వైఎస్సార్ అభిమానులు ఒక పక్క, ఎన్టీఆర్ అభిమానులు మరో పక్క ఉన్నారన్నారు. 2004 ముందు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇళ్ళ కోసం ఎన్నో సంవత్సరాలు పోరాడామన్నారు. వైఎస్సార్ ముఖ్యమంత్రి అయ్యాక ఇళ్ళ స్థలంతో సహా ఇళ్ళు ఇచ్చారన్నారు. ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్‌లను అతి తక్కువ ఖర్చుతో నిర్మించారన్నారు. వైఎస్సార్ మరణంతో ఆ ప్రాజెక్టులు ఆగిపోవడం బాధాకరమన్నారు. మరో రెండు దశాబ్దాలు వైఎస్సార్ ప్రజల మనస్సులో ఉంటారన్నారు.