- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఆర్ఎస్‌తో వామపక్షాల పొత్తుపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్‌తో కమ్యూనిస్టుల పొత్తుపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఊసరవెల్లిలాంటిదని దీని గురించి కమ్యూనిస్టు సోదరులు ఎంత త్వరగా అర్థం చేసుకుంటే వారికి, ఈ సమాజానికి అంత మంచిది అన్నారు. కమ్యూనిస్టులకు కార్యకర్తలు లేరు. జెండాలు మోసేందుకు ఆశా వర్కర్లను, అంగన్ వాడీలను వాడుకుంటున్నారంటూ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పేపర్ క్లిప్‌ను రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏరు దాటాక తెప్ప తగలేయడం ఈ మామ అల్లుళ్లకు అలవాటే అని మరోసారి హరీశ్ రావు రుజువు చేశారని విమర్శించారు.
మునుగోడులో కమ్యూనిస్టుల మద్దతుతో గెలిచి ఇప్పుడు ఎర్రజెండాలు మోసేటోడే లేడని మంత్రి మాట్లాడుతున్నారని, మంత్రి వ్యాఖ్యలను కమ్యూనిస్టులు అర్థం చేసుకోవాలని హితవు పలికారు. కాగా, బీఆర్ఎస్‌తో పొత్తు విషయంలో కమ్యూనిస్టు పార్టీలు గత కొంత కాలంగా తర్జన భర్జన పడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఎర్రజెండా పార్టీలు కోరినన్ని టికెట్లు ఇచ్చేందుకు గులాబీ బాస్ కేసీఆర్ సుముఖంగా లేరని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో బీఆర్ఎస్ కలిసి నడిచే విషయంలో కమ్యూనిస్టు నేతలు ఆలోచనలో పడినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఇలాంటి తరుణంలో మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యలు చేయడం వాటిపై రేవంత్ రెడ్డి స్పందించడం ఆసక్తిగా మారింది.
- Tags
- revanth reddy