పొన్నాలతో ఆర్.కృష్ణయ్య భేటీ.. బీసీలకు టికెట్ల కేటాయింపుపై చర్చ!

by GSrikanth |   ( Updated:2023-08-30 10:16:07.0  )
పొన్నాలతో ఆర్.కృష్ణయ్య భేటీ.. బీసీలకు టికెట్ల కేటాయింపుపై చర్చ!
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాబోయే ఎన్నికల్లో బీసీలకు అన్ని పార్టీలు తగినన్ని సీట్లు ఇవ్వాలని డిమాండ్లు వ్యక్తం అవుతున్న వేళ కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య, రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. బుధవారం ఈ ఇద్దరు నేతలు సమావేశమై బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్‌పై చర్చించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ బీసీలకు పెద్ద ఎత్తున సీట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశానన్నారు.

బీసీలకు టికెట్ ఇవ్వకపోతే ప్రజాగ్రహం తప్పదని.. బీసీ నేతలకు టికెట్లు కేటాయించేలా అన్ని పార్టీలపై ఒత్తిడి తీసుకువస్తున్నామని చెప్పారు. కేసీఆర్ అసెంబ్లీ బీసీలను సీట్లు పెంచాలని డిమాండ్ చేశారు. బీసీ పక్షాన కాంగ్రెస్ పార్టీలో పొన్నాల పోరాడాలని కోరారు. బీసీ డిక్లరేషన్‌లోనూ పలు అంశాలను చేర్చాలని డిమాండ్లు ప్రతిపాదించామన్నారు. పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ.. సామాజిక కోణం విస్మరించకుండా కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని, బీసీ డిక్లరేషన్‌లో అన్ని అంశాలు పొందుపరుస్తామన్నారు. గతంలో బీసీలకు ఏమి చేయలేదో అది చేసే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుందన్నారు.

Advertisement

Next Story