- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TS Election: పోలింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్ నేతల అత్యుత్సాహం
దిశ, వెబ్‌డెస్క్: హైదారాబాద్‌లోని కంటోన్మెంట్ పోలింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్ నేతల అత్యుత్సాహం ప్రదర్శించారు. ఓటు వేస్తూ ఈవీఎం మిషన్‌తోపాటు WPAT లను ఫొటోలు తీసుకొని వాట్సాప్ స్టేటస్‌లు పెట్టారు. అంతేకాదు.. ఈ ఫొటోలు పలు స్థానిక వాట్సాప్ గ్రూపుల్లోనూ పోస్టు చేశారు. అవికాస్త వైరల్ కావడంతో వివాదాస్పదంగా మారాయి. కాగా, పోలింగ్ కేంద్రంలోకి ఎలక్ట్రిక్ పరికరాలను అధికారులు నిషేధించారు. అది గమనించకుండా పోలింగ్ కేంద్రంలోకి ఎంట్రీ ఇచ్చిన వారిపై అధికారులు, ఇతర పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు భారీగా ప్రజలు తరలివస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు, సినీతారలు ఓటేసి వెళ్లారు. అయితే, కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయిస్తుండటంతో ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఫలితంగా కొన్ని చోట్ల ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది.