- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సారీ.. నేను పోటీ చేయట్లేదు.. ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నా
దిశ ప్రతినిధి, మెదక్: నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ సురేష్ షెట్కర్ పేరును ఖరారు చేసింది. కానీ చివరి నిమిషంలో ఆయన మనసు మార్చుకుని పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. పార్టీ హైకమాండ్‌కు కూడా ఇదే విషయాన్ని తెలిపారు. దీంతో అక్కడి నుంచి టికెట్ ఆశించిన సంజీవరెడ్డికి చాన్స్ లభించింది. స్వయంగా సురేష్ షెట్కర్ పోటీ నుంచి తప్పుకునే అంశాన్ని ప్రకటించడంతో పాటు సంజీవరెడ్డికి సంపూర్ణ సహకారం ఇస్తానని, ఆయనను గెలిపించుకుంటానని ప్రకటించారు. నామినేషన్ వేసే కార్యక్రమానికి స్వయంగా తానే వెళ్ళి మద్దతు పలుకుతానని తెలిపారు. నామినేషన్ చివరి రోజున ఊహించని తీరులో జరిగిన ఈ పరిణామాన్ని పార్టీ పెద్దలు కూడా స్వాగతించారు. కాంగ్రెస్ తరఫున ఆ స్థానంలో సంజీవరెడ్డి అధికారిక అభ్యర్థి కానున్నారు.
టికెట్ రాలేదని అసంతృప్తితో మదనపడుతూ పార్టీ మారడానికి సిద్ధమవుతున్న సమయంలో సురేష్ షెట్కర్ ఈ నిర్ణయణం తీసుకోవడం పార్టీ శ్రేణులకు ఉత్సాహం కలిగించింది. గతంలో కల్వకుర్తి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డికి టికెట్ ఇవ్వడానికి పార్టీ కేంద్ర నాయకత్వం సిద్ధమైనా స్వచ్ఛందంగా తనకు టికెట్ అవసరం లేదని, ఇక్కడి నుంచి పోటీ చేయాలని ఆశిస్తున్న కసిరెడ్డి నారాయణరెడ్డికి చాన్స్ ఇవ్వాలని ప్రతిపాదించారు. ఆ ప్రకార ఆ సెగ్మెంట్లో కసిరెడ్డి బరిలో ఉన్నారు. ఇద్దరూ కలిసి ఎన్నికల ప్రచారం చేయడాన్ని, పరస్పరం సహకరించుకోడాన్ని పార్టీ నాయకత్వం సైతం అభినందించింది. దీనికి కొనసాగింపుగా ఇప్పుడు నారాయణఖేడ్‌లో సైతం మాజీ ఎంపీ సురేష్ షెట్కర్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం గమనార్హం.