డబ్బుల సంచులతో దిగుతున్నారు.. ఎమ్మెల్యే సీతక్క సంచలన వ్యాఖ్యలు

by GSrikanth |   ( Updated:2023-08-29 14:33:42.0  )
డబ్బుల సంచులతో దిగుతున్నారు.. ఎమ్మెల్యే సీతక్క సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ములుగు రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. ఈ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకునేలా బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యే సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. నన్ను ఓడిస్తామని డబ్బు సంచులతో దిగుతున్నారని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తనను ఓడించేందుకు బీఆర్ఎస్ మిడతల దండు వస్తోందని, అయితే తాను ఎక్కడా భూకబ్జాలు చేయలేదని అక్రమంగా కేసులు పెట్టించలేదన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన సీతక్క ప్రజల్లో తనకు వస్తున్న ఆదరాభిమానాలను చూసి ఓర్వలేకే టార్గెట్ చేస్తున్నారని ప్రజల మధ్య ఉండటమే తాను చెస్తున్న తప్పా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో సీతక్క పని తనాన్ని మెచ్చుకుని ఇక్కడికి వచ్చి ఓడిస్తామని అంటున్నారని ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ప్రశ్నించే గొంతుకను చట్టసభలోకి రాకుండా అడ్డుకోలేరని అన్నారు.

Advertisement

Next Story