అన్ని పార్టీల్లో అభ్యర్థులను నేనే డిసైడ్ చేస్తా: Minister Malla Reddy

by GSrikanth |   ( Updated:2023-08-03 07:13:16.0  )
అన్ని పార్టీల్లో అభ్యర్థులను నేనే డిసైడ్ చేస్తా: Minister Malla Reddy
X

దిశ, డైనమిక్ బ్యూరో: మంత్రి మల్లారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మేడ్చల్ నియోజకవర్గంలో ఏ పార్టీలో ఏ అభ్యర్థి ఉండాలో డిసైడ్ చేసేది తానే అన్నారు. గురువారం అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్ చాట్ చేసిన మంత్రి.. మేడ్చల్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో టికెట్లపై స్పందించారు. ఏ పార్టీలో ఎవరు అభ్యర్థి ఉండాలో తానే నిర్ణయిస్తానన్నారు. కాంగ్రెస్‌లో కూడా ఏ క్యాండిడేట్ ఉండాలో డిసైడ్ చేయబోయేది తానేనని గత ఎన్నికల్లో కేఎల్ఆర్‌కు టికెట్ ఇప్పించిందే నేను అని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.

కాంగ్రెస్ అధిష్టానంలో తనకు స్నేహితులు ఉన్నారని చెప్పారు. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ అంటే తన పోస్టు ఊడుతుందని ప్రచారం చేశారని, నిజానికి రేవంత్ రెడ్డిపై తొడగొట్టిన తర్వాత తన గ్రాఫ్ పెరిగిందన్నారు. కావాలనే కొంతమంది తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే తాను సొంతంగా ఓ మీడియా సంస్థ ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. తెలంగాణ యాసలో ఏడాదికి నాలుగు సినిమాలు కూడా తీస్తానన్నారు.

Read More : ఆర్టీసీ విలీనం ఎన్నికల స్టంటే - మంత్రి మల్లారెడ్డి

Advertisement

Next Story