- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ నెలలోనే టీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. నేడు, రేపు కీలక సమావేశం
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైంది. పార్టీలన్నీ ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. అభ్యర్థులను సిద్దం చేసుకోవడంతో పాటు ఎన్నికల హామీలను ముందుగానే ప్రకటిస్తున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే మేనిఫెస్టో, అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్దమవుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించగా.. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల పేరుతో ఎన్నికల హామీలు ప్రకటించింది.
ఇక కాంగ్రెస్ కూడా అభ్యర్థుల ఎంపికను షురూ చేసింది. ఈ నెలాఖరుకు కాంగ్రెస్ తొలి జాబితా రానుందని తెలుస్తోంది. నేడు, రేపు ఢిల్లీలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశంలో అభ్యర్థుల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి జాబితాను షార్ట్ లిస్ట్ చేయనున్నారు. అనంతరం ఈ నెలాఖరులో లేదా అక్టోబర్ మొదటి వారంలో అభ్యర్థులను ప్రకటించే అవకాశముందని సమాచారం. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న క్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు. దీంతో రేవంత్ రెడ్డి కూడా స్క్రీనింగ్ కమిటీ భేటీలో పాల్గొననున్నారు.
సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొననున్నారు. 119 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల పేర్లను షార్ట్ లిస్ట్ చేయనున్నారు. గతంలో పలుమార్లు స్క్రీనింగ్ కమిటీ హైదరాబాద్‌లో భేటీ నిర్వహించింది. ఈ సందర్బంగా దరఖాస్తులను పరిశీలించి కొందరి పేర్లను షార్ట్ లిస్ట్ చేసింది. ఇప్పుడు తుది జాబితాను సిద్దం చేయనుంది.