కాంగ్రెస్‌తో అందుకే చర్చలు జరిపాం.. వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు

by Javid Pasha |   ( Updated:2023-10-12 10:46:15.0  )
కాంగ్రెస్‌తో అందుకే చర్చలు జరిపాం.. వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్‌లో వైఎస్సార్‌టీపీని విలీనం చేయడంపై అవగాహన కుదరకపోవడంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఒంటరిగానే వెళ్లాలని వైఎస్ షర్మిల నిర్ణయం తీసుకున్నారు. అభ్యర్థుల ఎంపిక, మ్యానిఫెస్టోపై కూడా షర్మిల దృష్టి పెట్టారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దించేందుకు షర్మిల సిద్దమయ్యారు. ఇందుకోసం ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని కూడా నిర్ణయించారు. మ్యానిఫెస్టోను కూడా రూపొందిస్తుండగా.. రెండు రోజుల్లో దీనిని విడుదల చేయనున్నారు.

బుధవారం లోటస్‌పాండ్‌లో వైఎస్సార్‌టీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వచ్చే ఎన్నికల్లో పోటీ, అభ్యర్థుల ఖరారు, మ్యానిఫెస్టో రూపకల్పనపై నేతలతో చర్చించారు. అనంతరం ఒంటరిగానే అన్ని స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించారు. ఆశావాహులందరూ నేటి నుంచి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తాను రెండు స్థానాల నుంచి పోటీ చేయనున్నట్లు నేతలకు షర్మిల తెలిపారు. పాలేరుతో పాటు మరో స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. తన భర్త అనిల్ కుమార్, తల్లి విజయలక్ష్మి కూడా పోటీ చేయాలని శ్రేణులు డిమాండ్ చేస్తున్నారని, అవసరమైతే విజయలక్ష్మి పోటీ చేస్తారని నేతలకు చెప్పారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్‌లో విలీనంకు చర్చలు జరపడానికి గల కారణం గురించి కూడా నేతలకు షర్మిల వివరించారు. 'కాంగ్రెస్‌తో కలిసి వెళ్తే ప్రజావ్యతిరేక ఓటు చీలదని అనుకున్నాం.. ఓట్లు చీలిస్తే మళ్లీ సీఎం కేసీఆర్ సీఎం అవుతారని అనుకున్నాం. అందుకే కాంగ్రెస్‌తో చర్చలు జరిపాం. 4 నెలలు వెయిట్ చేశాం' అని షర్మిల తెలిపారు.

Advertisement

Next Story