‘కాంగ్రెస్‌కు 78 నుంచి 82 సీట్లు ఖాయం’

by Anjali |   ( Updated:2023-11-26 14:23:31.0  )
‘కాంగ్రెస్‌కు 78 నుంచి 82 సీట్లు ఖాయం’
X

దిశ, వెబ్‌డెస్క్: పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అభ్యర్థులంతా ప్రమాణస్వీకారానికి సిద్ధంగా ఉండాలని అన్నారు. కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ 78 నుంచి 82 సీట్లు గెలుచుకోబోతుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కేసీఆర్ అవినీతిని వెలికితీస్తామని అన్నారు. పాలేరులో తనను ఎలాగైనా ఓడించాలని కేసీఆర్ కొత్త కుట్రలకు తెరలేపాడని, స్థానిక బీఆర్ఎస్‌ అభ్యర్థి కందాళ ఉపేందర్‌ రెడ్డికి రూ.300 కోట్లు పంపించారని సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆరే కాదు ఎవరొచ్చినా తన గెలుపును ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి ఖమ్మంలో అన్ని స్థానాలను కాంగ్రెస్ గెలుచుకోబోతుందని చెప్పారు. బీఆర్‌ఎస్ అభ్యర్థులను అసెంబ్లీ గేట్ తాకనివ్వబోమని అన్నారు. కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజల బతుకులు విచ్ఛిన్నమయ్యాయి అని అన్నారు. కేసీఆర్ పదేళ్ల దోచుకున్న లక్షల కోట్లతో మూడోసారి అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నాడని చెప్పాడు. ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్‌ను నమ్మడానికి వీళ్లేదని అన్నారు.

Advertisement

Next Story