- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాలమూరు జిల్లాలోని ఆ ఐదు నియోజకవర్గాలు జూపల్లి అనుచరులకే?
దిశ, మహబూబ్ నగర్ బ్యూరో: సమావేశాలు, సుదీర్ఘ సమాలోచనల అనంతరం మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్రంలో అధికార పార్టీని ఓడించేందుకు బీజేపీలో చేరాలా? కాంగ్రెస్‌లో చేరాలా? లేక ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటు చేస్తే ప్రయోజనం ఉంటుందా అన్న అంశాలపై గత రెండు నెలలుగా జూపల్లి, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి వరుసగా పలువురు నేతలు, మేధావులతో చర్చలు జరిపారు. ప్రస్తుత తరుణంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్లనే ప్రయోజనం ఉంటుందన్న నిర్ణయానికి జూపల్లి, పొంగులేటి వచ్చారు. గత కొన్ని వారాలుగా కాంగ్రెస్ పార్టీ నేతలు పొంగులేటి, జూపల్లితో చర్చలు సైతం జరిపారు.
ఇందులో భాగంగా సోమవారం హైదరాబాద్‌లో రాహుల్ గాంధీ పంపిన పలువురు ముఖ్య నేతలు హైదరాబాదుకు వచ్చి జూపల్లి, పొంగులేటితో చర్చలు జరిపినట్లు సమాచారం. పొంగులేటి ఖమ్మం జిల్లాలో ఉన్న పది అసెంబ్లీ సీట్లలో 8 తన అనుచరులకు కేటాయించాలని పార్టీ నేతల ముందు ప్రతిపాదించినట్లు సమాచారం. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సైతం ఉమ్మడి పాలమూరు జిల్లాలో తన అనుచరులకు సీట్లు ఇవ్వాలని ప్రతిపాదనలు ముందుంచినట్లు సమాచారం. జూపల్లి పోటీ చేయనున్న కొల్లాపూర్ నియోజక వర్గంతో పాటు, వనపర్తి, నాగర్ కర్నూల్, కల్వకుర్తి, మహబూబ్ నగర్ నియోజకవర్గాలను కేటాయించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. వీటిలో నాలుగింటికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి తిరిగి వచ్చిన వెంటనే పూర్తిస్థాయిలో చర్చలు జరిపి చేరికల తేదీలను ఖరారు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.