సర్వే ఫలితాలు విడుదల.. తెలంగాణలో ఆ పార్టీదే అధికారం!

by GSrikanth |   ( Updated:2023-10-23 11:39:09.0  )
సర్వే ఫలితాలు విడుదల.. తెలంగాణలో ఆ పార్టీదే అధికారం!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారింది. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ప్రచారం షురూ చేశాయి. సినిమా డైలాగుల మాదిరి ప్రచారంలో ఘాటు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ మొత్తం అభ్యర్థులను, కాంగ్రెస్ మొదటి లిస్టును విడుదల చేసి వేగం పెంచగా.. బీజేపీ నుంచి తొలి జాబితా విడుదల కావాల్సి ఉంది. ఈ క్రమంలో రాష్ట్రంలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయో తెలియజేస్తూ ఇండియా టీవీ నిర్వహించిన సర్వే ఫలితాలను విడుదల చేయడం సంచలనంగా మారింది.

ఇండియా టీవీ సర్వేలో అధికార బీఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారంలోకి రాబోతోందని వెల్లడించింది. తాజాగా.. ఒపీనియన్ పోల్స్ ఫలితాలను ఇండియా టీవీ విడుదల చేసింది. ఇందులో బీఆర్ఎస్‌కు 70 సీట్లు, కాంగ్రెస్‌కు 34 సీట్లు, బీజేపీకి 7, ఎమ్ఐఎమ్‌కు 7 సీట్లు వస్తాయని పేర్కొంది. కాగా, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు 88, కాంగ్రెస్‌కు 19, ఎమ్ఐఎమ్‌ 7, ఇతరులు నాలుగు చోట్ల విజయం సాధించారు. మరి ఇండియా టీవీ సర్వే ఫలితాలపై ప్రధాన పార్టీల నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Advertisement

Next Story

Most Viewed