- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నకిరేకల్ నేతలతో ఎంపీ కోమటిరెడ్డి కీలక సమావేశం!
దిశ, డైనమిక్ బ్యూరో: ఉమ్మడి నల్గొండ కాంగ్రెస్‌లో రాజకీయం ఆసక్తిగా మారుతోంది. బీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్‌లో చేరబోతున్నారనే ప్రచారం జరుగుతున్న వేళ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కార్యకర్తలతో భేటీ కావడం సంచలనం రేపుతున్నది. శనివారం తన వ్యవసాయ క్షేత్రంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నకిరేకల్ నేతలతో భేటీ అయ్యారు. గత ఎన్నికల్లో నకిరేకల్‌లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన చిరుమర్తి లింగయ్య బీఆర్ఎస్‌లో చేరారు.
దాంతో ఈసారి కాంగ్రెస్ పార్టీలో ఆశావాహుల సంఖ్య పెరిగిపోయింది. ఇదే తరుణంలో వేముల వీరేశం సైతం కాంగ్రెస్‌లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారనే ప్రచారం వేళ వెంకట్ రెడ్డి నకిరేకల్ నియోజకవర్గానికి చెందిన నేతలతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ తరపున అన్ని స్థానాలకు అభ్యర్థులు ఉన్నారని కొత్తగా ఎవరూ చేరాల్సిన అవసరం లేదని గతంలో వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీంతో కోమటిరెడ్డి భేటీ వేముల వీరేశంను ఆహ్వానించడానికా లేక అడ్డుకోవడానికా అనేది సస్పెన్స్‌గా మారింది.