తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల తుది జాబితా విడుదల

by GSrikanth |   ( Updated:2023-11-09 16:59:15.0  )
తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల తుది జాబితా విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల తుది జాబితా విడుదలైంది. ఐదు అభ్యర్థులతో కూడిన జాబితాను గురువారం రాత్రి అధిష్టానం విడుదల చేసింది. తుంగతుర్తి నుంచి మందుల సామేలు, పటాన్ చెరు కాట శ్రీనివాస్ గౌడ్, చార్మినార్ మహమ్మద్ ముజీబ్ ఉల్లా షరీఫ్, మిర్యాలగూడ బత్తుల లక్ష్మారెడ్డి, సూర్యాపేట దామోదర్ రెడ్డిలకు టికెట్ ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, అనూహ్యంగా ఇప్పటికే పటాన్ చెరు నియోజకవర్గం నీలం మధు ముదిరాజ్‌కు కేటాయించిన కాంగ్రెస్.. అనూహ్యంగా అభ్యర్థిని మార్చింది. తుది జాబితాలో ఆ నియోజకవర్గ అభ్యర్థిగా కాట శ్రీనివాస్ గౌడ్‌ను ఫైనల్ చేసింది. మరి దీనిపై మధు, ఆయన అనుచరులు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి. మరోవైపు ఇంతకాలం తనకు టికెట్ వస్తుందని భావించిన తుంగతుర్తి నియోజకవర్గ నేత అద్దంకి దయాకర్‌కు హైకమాండ్ ట్విస్ట్ ఇచ్చింది. ఆ నియోజకవర్గంలో మందుల శ్యామ్యూల్‌ను ఖరారు చేసింది. దీనిపై అద్దంకి ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.

Read More..

'కాంగ్రెస్ బైక్ ర్యాలీకి పిలిచి డబ్బులివ్వలేదు’




Advertisement

Next Story

Most Viewed