- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కమ్యూనిస్టులు ఎటువైపు ఉంటే.. వారికే అధికారం: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
దిశ, డైనమిక్ బ్యూరో: కమ్యూనిస్టులు తెలంగాణలో ఎటువైపు ఉంటే వారు అధికారికారానికి వచ్చే అవకాశం ఉంటుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఇవాళ ఆయన సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఖమ్మంలో కాంగ్రెస్ 9 సీట్లు గెలవడం జరిగిందని, నల్గొండలో 11 చోట్ల గెలవడం, రంగారెడ్డి, కోల్ బెల్ట్ ఏరియా, కరీంనగర్, ఆదిలాబాద్ లాంటి పలు జిల్లాలో కమ్యూనిస్టుల ప్రభావం ఉందన్నారు. కమ్యూనిస్టుల సపోర్ట్ బాగా ఉపయోగపడ్డదన్నారు. కాంగ్రెస్ గెలవడం భవిష్యత్తుకు సంకేతమని, కాంగ్రెస్ పార్టీ జాగ్రత్తగా ఉండాలని కొరుకుంటున్నట్లు అన్నారు. కాంగ్రెస్ పార్టీని, హామీలను ప్రజలు విశ్వసించారని తెలిపారు, ఎందుకు కంటే గతంలో కేసీఆర్ ఇంతకంటే గొప్పగొప్ప హామీలు ఇచ్చిన విశ్వసించలేదని, పదేళ్లలో చేయలేని వారు ఇప్పడేమి చేస్తారని ప్రజలు నమ్మలేదన్నారు. సీపీఐ, కాంగ్రెస్ పొత్తు పెట్టుకుందని, దురదృష్టవశాత్తు సీపీఎం పొత్తు పెట్టుకోలేకపోయిందని గుర్తుచేశారు. అది వాళ్ల తప్పిదం కాదని, సీట్ల వ్యవహారం లో కొంత తేడా వచ్చిందని, అయిన సీపీఎం స్వచ్చందంగా ఎన్నికల్లో 19 చోట్ల పోటీ చేశారని, మిగిలిన చోట్ల సీపీఐ, కాంగ్రెస్ కు సపోర్ట్ చేశారని తెలిపారు. కాంగ్రెస్, సీపీఐ పొత్తు చాలా కలిసి వచ్చిందన్నారు.