- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో కాంగ్రెస్ ఘన విజయం.. పదేళ్ల తర్వాత అధికారంలోకి
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. రాష్ట్రం ఇచ్చిన పార్టీగా దాదాపు పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. 63 స్థానాల్లో సంపూర్ణ మెజార్టీతో అధికారాన్ని కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ 41 స్థానాలకు పరిమితం అయింది. బీజేపీ ఎనిమిది స్థానాల్లో, ఎమ్ఐఎమ్ ఏడు స్థానాల్లో గెలుపు బావుటా ఎగురవేశాయి. అంతేకాదు.. బీఆర్ఎస్‌లో దాదాపు ఆరుగురు మంత్రులు ఓటమి చెందగా.. కాంగ్రెస్ అగ్ర నేతలంతా విక్టరీ సాధించారు. కాగా, ఫలితాలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇక నుంచి ప్రగతిభవన్‌ను ప్రజాభవన్‌గా మార్చబోతున్నామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
కాంగ్రెస్ విజయం అమరవీరులకు అంకితం చేస్తామన్నారు. వాళ్ల ఆకాంక్షలను నెరవేర్చుతామన్నారు. పేదల బతుకులు బాగుపడేందుకు కాంగ్రెస్ పనిచేస్తుందన్నారు. ప్రతిపక్షాల సలహాలు, సూచనలు స్వీకరించి కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుందన్నారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు విలక్షణమైన తీర్పు ఇవ్వడం సంతోషకరమన్నారు. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించి ప్రజల జీవితాలను బాగు చేస్తామన్నారు. కాంగ్రెస్ గెలుపులో ప్రజలు, 30 లక్షల మంది నిరుద్యోగులు, సీపీఐ, జనసమితి పార్టీలు మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ట్విట్టర్‌లో కాంగ్రెస్ గెలుపునకు అభినందనలు తెలిపిన కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.