- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ వర్సెస్ ఎంఐఎం.. కైట్‌కు తూట్లు పెట్టెందుకు హస్తం పార్టీ స్కెచ్
దిశ,డైనమిక్ బ్యూరో: నేతల చేరికలతో ఫుల్‌జోష్‌లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇదే ఉత్సాహన్ని కంటిన్యూ చేస్తూ అధికార బీఆర్ఎస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేసేలా ప్రణాళికలు రచిస్తోంది. రాష్ట్రమంతటా బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీస్తూనే ఆ పార్టీకి మద్దతుగా నిలుస్తున్న ఎంఐఎంపైనా గురిపెట్టడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నది. రాబోయే ఎన్నిక్లలో బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నామని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ బహిరంగంగానే ప్రకటన చేయడంతోపాటు కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ఓల్డ్ సిటీపై ఫోకస్ పెట్టింది. రాబోయే అసెంబ్లీ ఎన్నిక్లలో ఓల్డ్ సిటీలో కాంగ్రెస్ వర్సెస్ కైట్ అన్నట్లుగా పోరు రసవత్తరంగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మైనార్టీ నేతలకు గాలం
ప్రస్తుతం టీ కాంగ్రెస్ బీఆర్ఎస్, బీజేపీలోని అసంతృప్త నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తోంది. ఇప్పటికే పలువురు నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకోగా మరికొందరు హస్తంతో చేతులు కలిపేందుకు సిద్ధం అవుతున్నారు. తాజాగా.. ఓల్డ్ సిటీపై కాంగ్రెస్ కన్నేయడం ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఇటీవల హైదరాబాద్ వేదికగా జరిగిన సీడబ్ల్యూసీ సమావేశాల సమయంలో ఓల్డ్ సిటీకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, మస్కతి డెయిరీ చైర్మన్ అలీ బిన్ ఇబ్రహీం మస్కతిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. పాతబస్తీలో స్థానికంగా పలుకుబడి ఉన్న మహ్మద్ అయూబ్ ఖాన్ అలియాస్ అయూబ్ తన కుమారులు షాబాజ్ ఖాన్, అర్బాజ్ ఖాన్‌తో కలిసి పార్టీలో చేరారు. ఇదే బాటలో టీడీపీ నేత, మాజీ కార్పొరేటర్ ముజఫర్ అలీఖాన్ సైతం కాంగ్రెస్ గూటికి చేరుతారనే ప్రచారం వినిపిస్తోంది. వీరితోపాటు మరికొంత మంది నాయకులను పార్టీలో చేర్చుకునేలా కాంగ్రెస్ ప్రయత్నాలు ప్రారంభించింది.
ఆ మూడు పార్టీలూ ఒకటే.. ఇదే వ్యూహం
బీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీలు ఒకే తాను ముక్కలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పదేపదే ప్రస్తావించారు. ఇటీవల తుక్కుగూడలో జరిగిన సభలోనూ ఇదే ఆరోపించారు. మైనార్టీల భద్రత విషయంలో ఎంఐఎం పార్టీ ద్వంద్వ నీతి అవలంబిస్తోందని, బీఆర్ఎస్‌కు మద్దతు తెలపడంతోపాటు బీజేపీకి అనుకూలించేలా మజ్లిస్ వ్యవహరిస్తోందని కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది. అందువల్ల కాంగ్రెస్ పార్టీకే మైనార్టీలు మద్దతుగా నిలవాలని హస్తం పార్టీ నేతలు కోరుతున్నారు.