- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరోసారి భేటీ కానున్న కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ.. ఆ తర్వాతే అభ్యర్థుల ప్రకటన
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ ముగిసింది. మరోసారి భేటీ కావాలని కమిటీ నిర్ణయించింది. ఇవాళ రెండన్నర గంటలపాటు అభ్యర్థుల అంశాలపై కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. తెలంగాణలోని 119 స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. దాదాపు అభ్యర్థుల జాబితా ఖరారు అయినట్లు తెలుస్తోంది. సోమవారం టీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు టీ కాంగ్రెస్ ముఖ్యనేతలందరినీ ఢిల్లీకి అధిష్టానం పిలిచింది. ఢిల్లీలో అందుబాటులో ఉండాలని నేతలందరికీ సూచించింది. దీంతో ఇవాళ కాంగ్రెస్ తొలి జాబితా విడుదల అవుతుందని అందరూ భావించారు. కానీ కొన్ని స్థానాలపై ఇంకా క్లారిటీ రాకపోవడంతో మరోసారి భేటీ కావాలని కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. దీంతో రేపు, మాపో మరోసారి భేటీ అయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
అటు బీజేపీ కూడా అభ్యర్థుల జాబితాపై కసరత్తు చేస్తోంది. రెండు రోజుల్లో బీజేపీ రాష్ట్ర కీలక నేతలు ఢిల్లీ వెళ్లనున్నారు. తొలి జాబితాపై రాష్ట్ర నేతలతో బీజేపీ హైకమాండ్ చర్చించనుంది. ఆ తర్వాత సుమారు 40 మందితో తొలి జాబితాను బీజేపీ ప్రకటించనుందని తెలుస్తోంది. తొలి జాబితాలో 10 మంది బీసీ అభ్యర్థులు ఉండే అవకాశముంది. మొత్తం సీట్లలో 33 శాతం మహిళలకు కేటాయించాని బీజేపీ నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ లిస్ట్ వచ్చేవరకు వేచిచూసే ధోరణిలో కమలం వర్గాలు ఉన్నాయి.