ఎన్నికల ప్రచారం మొదలెట్టిన కేసీఆర్ మనవడు.. ఇండియాను షేక్ చేసిన సినిమా డైలాగ్‌తో ఎంట్రీ! (వీడియో)

by GSrikanth |   ( Updated:2023-10-13 06:40:43.0  )
ఎన్నికల ప్రచారం మొదలెట్టిన కేసీఆర్ మనవడు.. ఇండియాను షేక్ చేసిన సినిమా డైలాగ్‌తో ఎంట్రీ! (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఎన్నికలకు నెల రోజుల గడువే ఉండటంతో బీఆర్ఎస్ శ్రేణులు ప్రచారం మొదలెట్టారు. అవకాశం ఉన్న ప్రతీ చోట ప్రభుత్వ సంక్షేమ పథకాల విశిష్టతను వివరిస్తున్నారు. అంతేకాదు.. సోషల్ మీడియాలో విస్తృతంగా పోస్టులు పెట్టడంతో పాటు ‘కేసీఆర్ వన్స్ ఎగైన్’ అంటూ గత నాలుగైదు రోజులుగా ట్రెండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈసారి ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ కుమారుడు కల్వకుంట్ల హిమాన్షు పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా.. సోషల్ మీడియా వేదికగా పార్టీకి తనవంతు కృషి చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే గతకొన్ని రోజులుగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలను, కేసీఆర్ పరిపాలనను వివరిస్తూ పోస్టులు పెడుతున్నారు. తాజాగా.. రెండ్రోజుల క్రితం ఓ ఆసక్తికర పోస్టు పెట్టారు. చిన్న సినిమాగా విడుదలై ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన కార్తికేయ-2 చిత్రంలోని ఒక డైలాగ్‌ను సీఎం కేసీఆర్‌ను వీడియోలకు లింక్ చేస్తూ ఇన్‌స్టాలో పోస్టు చేశారు. ఈ పోస్టుకు నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు మళ్లీ కేసీఆరే గెలుస్తారని అంటుండగా.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేవలం హైదరాబాద్ నగరాన్నే అభివృద్ధి చేశారు. గ్రామాలను గాలికొదిలేశారు. ఎట్టిపరిస్థితుల్లో ఈసారి కేసీఆర్ ఓడిపోవడం ఖాయమని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. మరి హిమాన్షు సోషల్ మీడియా ప్రచారం బీఆర్ఎస్‌కు ఎంతమేర పనిచేస్తుందో చూడాలి..




Advertisement

Next Story