కాంగ్రెస్ మేనిఫెస్టోపై సీఎం కేసీఆర్ రియాక్షన్

by GSrikanth |   ( Updated:2023-11-17 10:46:38.0  )
కాంగ్రెస్ మేనిఫెస్టోపై సీఎం కేసీఆర్ రియాక్షన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ దోకాబాజ్ పార్టీ అని ఉన్న తెలంగాణను ఊడగొట్టి దశాబ్దాలపాటు ఏడిపించిన పార్టీ కాంగ్రెస్ బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ విమర్శించారు. తెలంగాణ వచ్చాక క్రమంగా అభివృద్ధి చేసుకుంటున్నామని బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి కళ్లకు కనబడుతున్నదన్నారు. శుక్రవారం కరీంనగర్, చొప్పదండి బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించిన కేసీఆర్.. కాంగ్రెస్ మేనిఫెస్టోపై స్పందించారు. ధరణి స్థానంలో భూ భారతి తెస్తామని కాంగ్రెస్ వాళ్లు చెబుతున్నారని ఇది కొత్తదేమి కాదన్నారు. భూ భారతిని 30, 40 ఏళ్ల క్రితమే తీసుకువచ్చారని దీంతో ఎమ్మార్వోలు, తహశీల్దార్లు, దళారుల మళ్లీ పాత కథే ఉంటుందని హెచ్చరించారు. ధరణి తీసేస్తే రైతు మళ్లీ లంచాలు పెరుగుతాయన్నారు. ధరణితో ఎవరి భూములపై వారికే అధికారం ఉందని ఆ అధికారం ఉంచుకుంటారో వదులుకుంటారో మీ ఇష్టం అన్నారు.

24 గంటల బీఆర్ఎస్ కావాలా 3 గంటల కాంగ్రెస్ కావాలా?

తెలంగాణ ఉద్యమం మొదలైనప్పటి నుంచి ఎన్నో విజయాలకు కరీంనగర్ గడ్డ కేంద్ర బిందువుగా ఉందని తెలంగాణ ఉద్యమానికి ప్జలకు వ్యక్తిగతంగా తనకు ఎన్నో విజయాలను అందించిన కరీంనగర్ గడ్డకు శిరసు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు. రైతులకు 24 గంటల కరెంట్ ఉండాలని చెబుతున్నది బీఆర్ఎస్ పార్టీ అయితే 3 గంటలే చాలు అంటున్నది కాంగ్రెస్ పార్టీ అని ఏ పార్టీ అధికారంలో ఉండాలో ప్రజలే నిర్ణయించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా రైతుబంధు ఇవ్వలేదు సరికదా మేమిస్తుండే అది వృథా అని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని రైతు బంధు ఇవ్వాలా వద్దా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను నమ్మి కర్నాటక ప్రజలు మోసపోయారని, అక్కడ 5 గంటల కరెంట్ కూడా ఇవ్వని కాంగ్రెస్ నేతలు 24 గంటల కరెంట్ ఇస్తున్న తెలంగాణకు వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని ప్రజలు ఆలోచన చేయాలన్నారు. కొండగట్టు అభివృద్ధిపై ప్రణాళికలు రూపొందించామని రూ. వెయ్యి కోట్ల వ్యయంతో ఈ క్షేత్రాన్ని దివ్యధామంగా తీర్చిదిద్దుతామన్నారు.

Advertisement

Next Story

Most Viewed