- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫ్లైట్ టికెట్ ఖర్చు నాదే.. కేసీఆర్‌కు భట్టి విక్రమార్క సంచలన సవాల్
దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందో లేదో ఓసారి కర్ణాటక వెళ్లి చూస్తే తెలుస్తుందని బీఆర్ఎస్ పార్టీ నేతలకు సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ హామీలను నమ్మొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ అంటున్నారని.. సీఎంతో పాటు కేటీఆర్, హరీశ్ రావు, కవిత ఈ నలుగురికి కర్నాటకకు వస్తే అక్కడ అమలు చేస్తున్న హామీలు చూపిస్తామన్నారు. వోల్వో బస్సులో వస్తారో లేక ఫ్లైట్‌లో వస్తారో వారు వస్తామంటే టికెట్లు మేమే బుక్ చేస్తామని ఛాలెంజ్ చేశారు. బుధవారం గాంధీ భవన్‌లో మాట్లాడిన భట్టి.. బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరగా సగం మందికి పింఛన్లు కోత విధించి గొప్పలు చెప్పుకోవడం కాంగ్రెస్ పార్టీ సంస్కృతి కాదన్నారు.
దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించిన అనుభవం, బడ్జెట్‌పై అవగాహన, మేధావుల లోతైన అధ్యయనాల అనంతరమే ఆరు గ్యారెంటీ స్కీమ్‌లను ప్రకటించామని అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లనే అమలు చేసి చూపిస్తామన్నారు. కాంగ్రెస్ నాయకులు ఇంటికి వచ్చి ఇస్తున్న గ్యారెంటీ కార్డులను ప్రజలు మూడు నెలల పాటు జాగ్రత్తగా దాచుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మీకిచ్చిన గ్యారెంటీ కార్డులోని పథకాలు అమలు చేస్తామన్నారు. రాహుల్ గాంధీని ఉద్దేశించి అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు బీజేపీకి ఉపయోగపడేలా ఉన్నాయని ధ్వజమెత్తారు. లౌకికవాది అయిన రాహుల్ గాంధీపై ఒవైసీ వ్యాఖ్యలు ఆయన ఆలోచనకు అద్ధం పడుతున్నాయని ఎద్దేవా చేశారు.