నాగార్జున సాగర్ ఇష్యూపై సీఈవో వికాస్ రాజ్ రియాక్షన్

by GSrikanth |   ( Updated:2023-11-30 05:11:35.0  )
నాగార్జున సాగర్ ఇష్యూపై సీఈవో వికాస్ రాజ్ రియాక్షన్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ వేళ నాగార్జునసాగర్ డ్యాం వద్ద ఇరు రాష్ట్రాల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకోవడం సంచలనంగా మారింది. నీటి వాటా కోసం అర్ధరాత్రి దాటిన తర్వాత ఏపీ పోలీసులు చొరబడి నాగార్జునసాగర్ డ్యామ్‌కు ముళ్లకంచె ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న తెలంగాణ పోలీసులు భారీగా అక్కడకు చేరుకున్నారు. ఈ క్రమంలో మాటా మాటా పెరిగి ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. తాజాగా.. ఈ వివాదంపై తెలంగాణ ఎన్నికల అధికారి వికాస్ రాజ్ స్పందించారు. ఆ విషయం పోలీసులు చూసుకుంటారని స్పష్టం చేశారు. ఆ ఇష్యూ గురించి రాజకీయ నేతలు తొందరపడి వ్యాఖ్యలు చేయవద్దని సూచించారు. నిబంధనలు ఎవరు అతిక్రమించొద్దని హెచ్చరించారు.

Advertisement

Next Story